Title (Indic)వాఁడివో కంటిరటరే వన్నెలవాఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వాఁడివో కంటిరటరే వన్నెలవాఁడు పైడి మోలము కటారు పరుజులవాఁడు (॥వాఁడి॥) పెద్ద కిరీటము వాఁడు పీతాంబరమువాఁడు వొద్దికఁ గౌస్తుభ మణివురము వాఁడు ముద్దుల మొగమువాఁడు ముత్తేల నామమువాఁడు అద్దిగో శంఖచక్రాల హస్తాలవాఁడు (॥వాఁడి॥) అందిన కటిహస్తము నభయహస్తమువాఁడు అందెల గజ్జలఁ బాదాల మరువాఁడు కుందణంపు యీ మకరకుండలంబులవాఁడు కందువ బాహుపురుల కడియాలవాఁడు (॥వాఁడి॥) నగవుఁజూపులవాఁడు నాభికమలమువాఁడు మొగపుల మొలనూళ్ళ మొలవాఁడు చిగురుమోము వాఁడు శ్రీ వేంకటేశుఁడు తగు నలమేలుమంగ తాళిమెడవాఁడు English(||pallavi||) vām̐ḍivo kaṁṭiraḍare vannĕlavām̐ḍu paiḍi molamu kaḍāru parujulavām̐ḍu (||vām̐ḍi||) pĕdda kirīḍamu vām̐ḍu pīdāṁbaramuvām̐ḍu vŏddigam̐ gaustubha maṇivuramu vām̐ḍu muddula mŏgamuvām̐ḍu muttela nāmamuvām̐ḍu addigo śhaṁkhasakrāla hastālavām̐ḍu (||vām̐ḍi||) aṁdina kaḍihastamu nabhayahastamuvām̐ḍu aṁdĕla gajjalam̐ bādāla maruvām̐ḍu kuṁdaṇaṁpu yī magaraguṁḍalaṁbulavām̐ḍu kaṁduva bāhuburula kaḍiyālavām̐ḍu (||vām̐ḍi||) nagavum̐jūbulavām̐ḍu nābhigamalamuvām̐ḍu mŏgabula mŏlanūḽḽa mŏlavām̐ḍu sigurumomu vām̐ḍu śhrī veṁkaḍeśhum̐ḍu tagu nalamelumaṁga tāḽimĕḍavām̐ḍu