Title (Indic)వాకిటఁ గాచుకున్నది వచ్చినదాఁకా నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వాకిటఁ గాచుకున్నది వచ్చినదాఁకా నీవు జోకతోడుత నెదురు చూచీ రావయ్యా (॥వాకి॥) విందుగాఁ దనయింటికి విచ్చేయు మనె నిన్ను అందుకోవయ్యా కానికె అంపె నీకాపె చెంది నిన్నుఁ దోడుకొని చేరి కొల్చి రమ్మనె అందలము వుత్తెంచె నదిగో రావయ్యా (॥వాకి॥) దండిగా నొసల నక్షంతలు నీకుఁ బెట్టుమనె దండము వెట్టుమనెను తనమారుగా యెండ గాకుండా గొడుగు యిదే పట్టుక రమ్మనె అండనే ముద్దుటుంగర మంపెను రావయ్యా (॥వాకి॥) కోరి పైడి పీఁటమీఁదఁ గూచుండఁ బెట్టుమనె చేరె నీసంగడికిఁ దాఁ జేకొను మిఁక యీరీతి శ్రీవేంకటేశ యీకె యలమేల్మంగ కూరిమితోఁ గూడితివి గుట్టున రావయ్యా English(||pallavi||) vāgiḍam̐ gāsugunnadi vachchinadām̐kā nīvu jogadoḍuda nĕduru sūsī rāvayyā (||vāgi||) viṁdugām̐ danayiṁṭigi vichcheyu manĕ ninnu aṁdugovayyā kānigĕ aṁpĕ nīgābĕ sĕṁdi ninnum̐ doḍugŏni seri kŏlsi rammanĕ aṁdalamu vuttĕṁchĕ nadigo rāvayyā (||vāgi||) daṁḍigā nŏsala nakṣhaṁtalu nīgum̐ bĕṭṭumanĕ daṁḍamu vĕṭṭumanĕnu tanamārugā yĕṁḍa gāguṁḍā gŏḍugu yide paṭṭuga rammanĕ aṁḍane mudduḍuṁgara maṁpĕnu rāvayyā (||vāgi||) kori paiḍi pīm̐ṭamīm̐dam̐ gūsuṁḍam̐ bĕṭṭumanĕ serĕ nīsaṁgaḍigim̐ dām̐ jegŏnu mim̐ka yīrīdi śhrīveṁkaḍeśha yīgĕ yalamelmaṁga kūrimidom̐ gūḍidivi guṭṭuna rāvayyā