Title (Indic)వాకిట నేల వున్నాఁడు వద్దికి రమ్మనవే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వాకిట నేల వున్నాఁడు వద్దికి రమ్మనవే చేకొని నేఁ జెప్పినట్టు సేసేటిదానను (॥వాకి॥) తన కితవైతేను తాలిమితో నుండుఁగాక వనితలతో నవ్వఁగా వద్దనేనటే చన వెవ్వతె కిచ్చినా సమ్మతించి వుందుఁగాక వెనకనే తెచ్చుకోఁగా వెంగెమాడేనటవే (॥వాకి॥) అంగన తనకు బాఁతియైతే నియ్యకొందుఁగాక కొంగువట్టి పెనఁగఁగాఁ గోపించేనటే సంగడిఁ బెట్టుకున్నాను సారె మెత్తుఁగా కాపెను సింగారించుకొమ్మనవే చెల్లదనేనటవే (॥వాకి॥) వాడికఁగా నడపితే వావిసేసుకొందుఁగాక వూడిగపుకాంతకుఁగా నొరసేనటే యీడనే శ్రీవేంకటేశుఁ డే నలమేలుమంగను కూడె నన్ను నీకెఁకుగాఁ గొసరేనటే English(||pallavi||) vāgiḍa nela vunnām̐ḍu vaddigi rammanave segŏni nem̐ jĕppinaṭṭu seseḍidānanu (||vāgi||) tana kidavaidenu tālimido nuṁḍum̐gāga vanidalado navvam̐gā vaddanenaḍe sana vĕvvadĕ kichchinā sammadiṁchi vuṁdum̐gāga vĕnagane tĕchchugom̐gā vĕṁgĕmāḍenaḍave (||vāgi||) aṁgana tanagu bām̐tiyaide niyyagŏṁdum̐gāga kŏṁguvaṭṭi pĕnam̐gam̐gām̐ gobiṁchenaḍe saṁgaḍim̐ bĕṭṭugunnānu sārĕ mĕttum̐gā kābĕnu siṁgāriṁchugŏmmanave sĕlladanenaḍave (||vāgi||) vāḍigam̐gā naḍabide vāvisesugŏṁdum̐gāga vūḍigabugāṁtagum̐gā nŏrasenaḍe yīḍane śhrīveṁkaḍeśhum̐ ḍe nalamelumaṁganu kūḍĕ nannu nīgĕm̐kugām̐ gŏsarenaḍe