Title (Indic)వాకిట నే లున్నాఁడవు వనితమాటలె యివి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వాకిట నే లున్నాఁడవు వనితమాటలె యివి లోకులు మెత్తురు నిన్ను లోనికి రావయ్యా (॥వాకిట॥) అంగనపాదంబుల అందెలు మెట్టెలునె సంగతి నిన్నుఁ బిలిచీఁ జాలదా యిది యెంగిలినోటఁ బిలిచే దెగ్గనివుంటే నీవు అంగవించి లోనికిరా వదియేమయ్యా (॥వాకిట॥) కంకణసూడిగములె కడు నీతో మాఁటలాడీ యింక ననుమానము నీ కేఁటికి నేఁడు పొంకపు మొనదంతాలు పూఁచి ప్రియముచెప్పదు అంకెలఁ బానుపు మీఁద నట్టె కూచుండవయ్యా (॥వాకిట॥) మొలనూలిగంటలనె ముచ్చట నీతో నాడీ యెలమి శ్రీవెంకటేశ యియ్యకోరాదా మెలఁగి పెదవితేనె మీఁదు నీ కెత్తుకున్నది కలసితి నాపె నిట్టె కంటివిగదయ్యా English(||pallavi||) vāgiḍa ne lunnām̐ḍavu vanidamāḍalĕ yivi logulu mĕtturu ninnu lonigi rāvayyā (||vāgiḍa||) aṁganabādaṁbula aṁdĕlu mĕṭṭĕlunĕ saṁgadi ninnum̐ bilisīm̐ jāladā yidi yĕṁgilinoḍam̐ bilise dĕgganivuṁṭe nīvu aṁgaviṁchi lonigirā vadiyemayyā (||vāgiḍa||) kaṁkaṇasūḍigamulĕ kaḍu nīdo mām̐ṭalāḍī yiṁka nanumānamu nī kem̐ṭigi nem̐ḍu pŏṁkabu mŏnadaṁtālu pūm̐si priyamusĕppadu aṁkĕlam̐ bānubu mīm̐da naṭṭĕ kūsuṁḍavayyā (||vāgiḍa||) mŏlanūligaṁṭalanĕ muchchaḍa nīdo nāḍī yĕlami śhrīvĕṁkaḍeśha yiyyagorādā mĕlam̐gi pĕdavidenĕ mīm̐du nī kĕttugunnadi kalasidi nābĕ niṭṭĕ kaṁṭivigadayyā