Title (Indic)వాడిక లాయె నీ పొందు వాసుదేవుఁడా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వాడిక లాయె నీ పొందు వాసుదేవుఁడా వాడుదేరెఁ గెమ్మోవి వాసుదేవుఁడా (॥వాడిక॥) వాలుకచూపులు మావి వాసుదేవుఁడా మమ్ము వాలాయించితివి నీవు వాసుదేవుఁడా వాలారుగోళ్ల నొత్తకు వాసుదేవుఁడా నీకు వైళమె నవ్వు వచ్చును వాసుదేవుఁడా (॥వాడిక॥) పలపెల్లా మా సొమ్ము వాసుదేవుఁడా యింత వలెనా మాతోడి రట్టు వాసుదేవుఁడా వలుములు చన్నులంటా వాసుదేవుఁడా వట్టి వళుకులఁ బెట్టకుమీ వాసుదేవుఁడా (॥వాడిక॥) వడదేరె శ్రీవేంకటవాదేవుఁడా యేల వడిసేవు తరితీపు వాసుదేవుఁడా వడిగొనఁ గూడితివి వాసుదేవుఁడా మన వడు వెవ్వరికిఁ గద్దు వాసుదేవుఁడా English(||pallavi||) vāḍiga lāyĕ nī pŏṁdu vāsudevum̐ḍā vāḍuderĕm̐ gĕmmovi vāsudevum̐ḍā (||vāḍiga||) vālugasūbulu māvi vāsudevum̐ḍā mammu vālāyiṁchidivi nīvu vāsudevum̐ḍā vālārugoḽla nŏttagu vāsudevum̐ḍā nīgu vaiḽamĕ navvu vachchunu vāsudevum̐ḍā (||vāḍiga||) palabĕllā mā sŏmmu vāsudevum̐ḍā yiṁta valĕnā mādoḍi raṭṭu vāsudevum̐ḍā valumulu sannulaṁṭā vāsudevum̐ḍā vaṭṭi vaḽugulam̐ bĕṭṭagumī vāsudevum̐ḍā (||vāḍiga||) vaḍaderĕ śhrīveṁkaḍavādevum̐ḍā yela vaḍisevu taridību vāsudevum̐ḍā vaḍigŏnam̐ gūḍidivi vāsudevum̐ḍā mana vaḍu vĕvvarigim̐ gaddu vāsudevum̐ḍā