Title (Indic)వాడవారి మెప్పించవలెఁగా నీకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వాడవారి మెప్పించవలెఁగా నీకు వాడుదేరి మాటలాడవలెఁగా నీకు (॥వాడ॥) చెలియవలపు నీ చిత్తానఁ బట్టకుండినా వలరాచపాది చూడవలెఁగా నీకు సెలవులనగవులు జిగి మించకుండినాను బలిమిఁ దెచ్చుకొనైనా వలెఁగా నీకు (॥వాడ॥) యీ వనితవూడిగాలు యింపులు గాకుండినాను వావికి సరస మాడవలెఁగా నీకు చేవదేరియాసలు చిమ్మి రేఁగ కుండినాను వావాత మొగమోట వలెఁగా నీకు (॥వాడ॥) తరుణిపై తలఁపు లాతల నీకు నుండినాను వరునకుఁ గౌఁగిలించవలెఁగా నీకు యిరవై శ్రీవేంకటేశ యింత సేసి కూడితివి వరుఁడవైన కీర్తి వలెఁగా నీకు English(||pallavi||) vāḍavāri mĕppiṁchavalĕm̐gā nīgu vāḍuderi māḍalāḍavalĕm̐gā nīgu (||vāḍa||) sĕliyavalabu nī sittānam̐ baṭṭaguṁḍinā valarāsabādi sūḍavalĕm̐gā nīgu sĕlavulanagavulu jigi miṁchaguṁḍinānu balimim̐ dĕchchugŏnainā valĕm̐gā nīgu (||vāḍa||) yī vanidavūḍigālu yiṁpulu gāguṁḍinānu vāvigi sarasa māḍavalĕm̐gā nīgu sevaderiyāsalu simmi rem̐ga kuṁḍinānu vāvāda mŏgamoḍa valĕm̐gā nīgu (||vāḍa||) taruṇibai talam̐pu lādala nīgu nuṁḍinānu varunagum̐ gaum̐giliṁchavalĕm̐gā nīgu yiravai śhrīveṁkaḍeśha yiṁta sesi kūḍidivi varum̐ḍavaina kīrdi valĕm̐gā nīgu