Title (Indic)వాడల వాడల వెంట వాఁడివో వాఁడివో WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వాడల వాడల వెంట వాఁడివో వాఁడివో నీడనుండి చీరలమ్మే నేఁతఁబేహారి (॥వాడల॥) పంచభూతములనెడి పలువన్నె నూలు చంచలపుగంజి వోసి చరిసేసి కొంచెపు కండెల నూలి గుణముల నేసి మంచిమంచి చీరలమ్మే మారు బేహారి (॥వాడల॥) మటుమాయములఁ దన మగువ పసిఁడి నీరు చిటిపొటి యలుకలఁ జిలికించఁగా కుటిలంపుఁ జేఁతలు కుచ్చులుగాఁ గట్టి పటవాళి చీరలమ్మే బలుబేహారి (॥వాడల॥) మచ్చిక కర్మమనేటి మైల సంతలోన వెచ్చపు కర్మధనము వెలువచేసి పచ్చడాలుగాఁ గుట్టి బలువేంకటపతి ఇచ్చకొలఁదుల నమ్మే ఇంటిబేహారి English(||pallavi||) vāḍala vāḍala vĕṁṭa vām̐ḍivo vām̐ḍivo nīḍanuṁḍi sīralamme nem̐tam̐behāri (||vāḍala||) paṁchabhūdamulanĕḍi paluvannĕ nūlu saṁchalabugaṁji vosi sarisesi kŏṁchĕbu kaṁḍĕla nūli guṇamula nesi maṁchimaṁchi sīralamme māru behāri (||vāḍala||) maḍumāyamulam̐ dana maguva pasim̐ḍi nīru siḍibŏḍi yalugalam̐ jiligiṁcham̐gā kuḍilaṁpum̐ jem̐talu kuchchulugām̐ gaṭṭi paḍavāḽi sīralamme balubehāri (||vāḍala||) machchiga karmamaneḍi maila saṁtalona vĕchchabu karmadhanamu vĕluvasesi pachchaḍālugām̐ guṭṭi baluveṁkaḍabadi ichchagŏlam̐dula namme iṁṭibehāri