Title (Indic)ఉవిదకు నీకు నెట్టి వొడఁబాటులో WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఉవిదకు నీకు నెట్టి వొడఁబాటులో జవళి రతుల నీతో సాము సేసీని (॥ఉవి॥) నలుగడలను నీవు నవ్వఁగాను జలజాక్షి సిగ్గునను జంకించీని బలిమిఁ గొంగు సెలసి పట్టఁగాను నిలుచుంచి లోలోనే నివ్వేరగందీని (॥ఉవి॥) అట్టె నీవు సరసము లాడఁగాను వొట్టువెట్టి నిన్ను గొర నొరసీని చట్టంటుఁజేఁతల నీవు చెనకఁగాను గుట్టుతోనే వలపులు గుబ్బతిలీని (॥ఉవి॥) చన్నులపై నీవు చేయీచాఁచఁగాను సన్నలనే తనమోవిని చవిచూపీని యిన్నిటా శ్రీవేంకటేశ యేలుకొంటివి మన్నించఁగా నీతోఁ దాను మాఁటలాడీని English(||pallavi||) uvidagu nīgu nĕṭṭi vŏḍam̐bāḍulo javaḽi radula nīdo sāmu sesīni (||uvi||) nalugaḍalanu nīvu navvam̐gānu jalajākṣhi siggunanu jaṁkiṁchīni balimim̐ gŏṁgu sĕlasi paṭṭam̐gānu nilusuṁchi lolone nivveragaṁdīni (||uvi||) aṭṭĕ nīvu sarasamu lāḍam̐gānu vŏṭṭuvĕṭṭi ninnu gŏra nŏrasīni saṭṭaṁṭum̐jem̐tala nīvu sĕnagam̐gānu guṭṭudone valabulu gubbadilīni (||uvi||) sannulabai nīvu seyīsām̐sam̐gānu sannalane tanamovini savisūbīni yinniḍā śhrīveṁkaḍeśha yelugŏṁṭivi manniṁcham̐gā nīdom̐ dānu mām̐ṭalāḍīni