Title (Indic)ఉమ్మడినే యేమనినా నూరకుండను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఉమ్మడినే యేమనినా నూరకుండను అమ్మరో యెంతట గబ్బి యనకుమీ నన్నును (॥॥) మాటలు నీవాడితేను మంచితేనెలు గారీని గాటమై నీచేఁతలై తే కారమయ్యీని యీటువెట్టితేఁ జవి యిదొకటీ నదొకటీ కూటమికౌ ననరాదు కోపగించ రాదు (॥॥) కన్నుల నీవు చూచితే కడు వెన్నెల గాసీని యెన్నబోతే నీసుద్దులు యెండ గాసీని పన్ని నవి నీ గుణాలు వచ్చియును వెచ్చియును అన్నీఁ జేతఁబట్టరాదు అటు దోయరాదు (॥॥) నీవాసలు వెట్టితేను నిలువు నూరువండీని భావించ నీ సింగారాలు పాలుకొనీని యీవల శ్రీవేంకటేశ యింతలో నన్నేలితివి చేవదేరె ననరాదు చిగురనరాదు English(||pallavi||) ummaḍine yemaninā nūraguṁḍanu ammaro yĕṁtaḍa gabbi yanagumī nannunu (||||) māḍalu nīvāḍidenu maṁchidenĕlu gārīni gāḍamai nīsem̐talai te kāramayyīni yīḍuvĕṭṭidem̐ javi yidŏgaḍī nadŏgaḍī kūḍamigau nanarādu kobagiṁcha rādu (||||) kannula nīvu sūside kaḍu vĕnnĕla gāsīni yĕnnabode nīsuddulu yĕṁḍa gāsīni panni navi nī guṇālu vachchiyunu vĕchchiyunu annīm̐ jedam̐baṭṭarādu aḍu doyarādu (||||) nīvāsalu vĕṭṭidenu niluvu nūruvaṁḍīni bhāviṁcha nī siṁgārālu pālugŏnīni yīvala śhrīveṁkaḍeśha yiṁtalo nannelidivi sevaderĕ nanarādu siguranarādu