Title (Indic)ఉమ్మడికర్మములాల వుండఁ జోటు మీకు లేదు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఉమ్మడికర్మములాల వుండఁ జోటు మీకు లేదు యిమ్ముల నెందైనాఁ బోరో యివి లేనిచోటికి (॥ఉమ్మ॥) పెట్టినది నుదుటను పెరుమాళ్ళ లాంఛనము దట్టమై భుజములందు దైవశిఖామణిముద్ర నెట్టన నాలుకవిూఁద నీలవర్ణునామమిదె అట్టె హరిదాసులకంటునా పాపములు (॥ఉమ్మ॥) మనసునఁ దలచేది మాధవుని పాదములు దినముఁ గడుపునించేది హరిప్రసాదము తనువుపైఁ దులసిపద్మాక్షమాలికలు చెనకి హరిదాసులఁ జేరునా బంధములు (॥ఉమ్మ॥) సంతతముఁ జేసేది సదాచార్యసేవ అంతరంగమున శరణాగతులసంగ మిదే యింతటాను శ్రీవేంకటేశుఁడు మమ్మేలినాఁడు అంతటా హరిదాసుల నందునా అజ్ఞానము English(||pallavi||) ummaḍigarmamulāla vuṁḍam̐ joḍu mīgu ledu yimmula nĕṁdainām̐ boro yivi lenisoḍigi (||umma||) pĕṭṭinadi nuduḍanu pĕrumāḽḽa lāṁchhanamu daṭṭamai bhujamulaṁdu daivaśhikhāmaṇimudra nĕṭṭana nālugaviూm̐da nīlavarṇunāmamidĕ aṭṭĕ haridāsulagaṁṭunā pābamulu (||umma||) manasunam̐ dalasedi mādhavuni pādamulu dinamum̐ gaḍubuniṁchedi hariprasādamu tanuvubaim̐ dulasibadmākṣhamāligalu sĕnagi haridāsulam̐ jerunā baṁdhamulu (||umma||) saṁtadamum̐ jesedi sadāsāryaseva aṁtaraṁgamuna śharaṇāgadulasaṁga mide yiṁtaḍānu śhrīveṁkaḍeśhum̐ḍu mammelinām̐ḍu aṁtaḍā haridāsula naṁdunā ajñānamu