Title (Indic)ఉంగరము సీతవొద్ది కొగి నంపినవానికి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఉంగరము సీతవొద్ది కొగి నంపినవానికి వుంగరాలు వేళ్లనిండా మెనరించరే (॥ఉంగర॥) మద్దులు విఱచిన మనపిన్నక్రిష్ణునికి మద్దికాయ లమరు నెమ్మదిఁ బెట్టరే గద్దించి రావిమానై కాంతలఁ బొందేవానికి ముద్దుగారే రావిరేక ముంగురులఁ గట్టరే (॥ఉంగర॥) ఘంటాకర్ణునిభక్తి గైకొనేటివానికి ఘంటలు మొలనూళ్లుఁ గట్టరమ్మా గెంటక గోరనే దైత్యుగీరి చంపినవీనికి జంట పులిగోరు మెడఁజక్క గట్టరే (॥ఉంగర॥) పాదముననే బండి పడఁ దన్నినవీనికి పాదపుగజ్జలందెలు వాని యిడరే గోదిలి గోవర్దనపుఁగొండ యెత్తినవానికి యీదెస శ్రీవేంకటాద్రి యెక్కి యాడఁదగునే English(||pallavi||) uṁgaramu sīdavŏddi kŏgi naṁpinavānigi vuṁgarālu veḽlaniṁḍā mĕnariṁchare (||uṁgara||) maddulu viṟasina manabinnakriṣhṇunigi maddigāya lamaru nĕmmadim̐ bĕṭṭare gaddiṁchi rāvimānai kāṁtalam̐ bŏṁdevānigi muddugāre rāvirega muṁgurulam̐ gaṭṭare (||uṁgara||) ghaṁṭāgarṇunibhakti gaigŏneḍivānigi ghaṁṭalu mŏlanūḽlum̐ gaṭṭarammā gĕṁṭaga gorane daityugīri saṁpinavīnigi jaṁṭa puligoru mĕḍam̐jakka gaṭṭare (||uṁgara||) pādamunane baṁḍi paḍam̐ danninavīnigi pādabugajjalaṁdĕlu vāni yiḍare godili govardanabum̐gŏṁḍa yĕttinavānigi yīdĕsa śhrīveṁkaḍādri yĕkki yāḍam̐dagune