Title (Indic)ఉండినట్టే వుండును వుండకున్న మానును WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఉండినట్టే వుండును వుండకున్న మానును అండనే శ్రీహరిమాయ నమరిన లోకము (॥ఉండి॥) యేదైనా మంచిదే యెట్టయినా మంచిదే సేద దేరినట్టి పూర్ణచిత్తునకును కాదు గూడదనరాదు కలస్వభావమునకు ఆదినుండి హరిమాయ నత్తినడి లోకము (॥ఉండి॥) యెండైనా మంచిదే యెంతనీడైనా మంచిదే పండినజ్ఞానభక్తుల ప్రసన్నులకు నిండె నిండదనరాదు నిచ్చనిచ్చఁబ్రకృతికి కొండవంటిహరిమాయ గురియైనలోకము (॥ఉండి॥) పాపమైన మంచిదే బలుపుణ్యమైన మంచిదే శ్రీపతిని శరణన్నజీవునికిని వోప నోపేన రాదు వొద్దిక శ్రీవేంకటేశు చేపట్టినమాయలోనఁ జిక్కినది లోకము English(||pallavi||) uṁḍinaṭṭe vuṁḍunu vuṁḍagunna mānunu aṁḍane śhrīharimāya namarina logamu (||uṁḍi||) yedainā maṁchide yĕṭṭayinā maṁchide seda derinaṭṭi pūrṇasittunagunu kādu gūḍadanarādu kalasvabhāvamunagu ādinuṁḍi harimāya nattinaḍi logamu (||uṁḍi||) yĕṁḍainā maṁchide yĕṁtanīḍainā maṁchide paṁḍinajñānabhaktula prasannulagu niṁḍĕ niṁḍadanarādu nichchanichcham̐brakṛtigi kŏṁḍavaṁṭiharimāya guriyainalogamu (||uṁḍi||) pābamaina maṁchide balubuṇyamaina maṁchide śhrībadini śharaṇannajīvunigini voba nobena rādu vŏddiga śhrīveṁkaḍeśhu sebaṭṭinamāyalonam̐ jikkinadi logamu