Title (Indic)ఉండవయ్య యించుకంత వుడుకువట్టీ వలపు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఉండవయ్య యించుకంత వుడుకువట్టీ వలపు దండిగా వెనకముందుఁ దలపించేఁ గాక (॥ఉండ॥) మంతనపునీమాటలు మఱచితినా నేను కాంతలతో జేప్పఁగాక కాకయ్యేవంటా వంతుకు మాటలాడితే వాఁడివోయనా యేమి చింతదీరఁ జెవిలోనే చెప్పిచూపేఁగాక (॥ఉండ॥) మళ్లీ నీసేవ సేయక మానితినా నేను వొళ్లల్లాఁ బచ్చయ్యీనంటా నుందానఁగాక వొల్లనే నవ్వు నవ్వితే వుండివోయనా యేమి ఇల్లిదె విడెమిచ్చి యెచ్చరించేఁగాక (॥ఉండ॥) వొద్దికైన నీరతుల కొడిగట్టనా నేను పెద్దరికమునీదంటాఁ బెనఁగేఁగాక బుద్దితో శ్రీవేంకటేశ పొందితివి నన్ను నిట్టె వొద్దనేనా నిన్ను నింకా వొరసేఁగాక English(||pallavi||) uṁḍavayya yiṁchugaṁta vuḍuguvaṭṭī valabu daṁḍigā vĕnagamuṁdum̐ dalabiṁchem̐ gāga (||uṁḍa||) maṁtanabunīmāḍalu maṟasidinā nenu kāṁtalado jeppam̐gāga kāgayyevaṁṭā vaṁtugu māḍalāḍide vām̐ḍivoyanā yemi siṁtadīram̐ jĕvilone sĕppisūbem̐gāga (||uṁḍa||) maḽlī nīseva seyaga mānidinā nenu vŏḽlallām̐ bachchayyīnaṁṭā nuṁdānam̐gāga vŏllane navvu navvide vuṁḍivoyanā yemi illidĕ viḍĕmichchi yĕchchariṁchem̐gāga (||uṁḍa||) vŏddigaina nīradula kŏḍigaṭṭanā nenu pĕddarigamunīdaṁṭām̐ bĕnam̐gem̐gāga buddido śhrīveṁkaḍeśha pŏṁdidivi nannu niṭṭĕ vŏddanenā ninnu niṁkā vŏrasem̐gāga