Title (Indic)ఉండవద్దా యిటువంటి వొడికాలను చను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఉండవద్దా యిటువంటి వొడికాలను చను- గొండలపై నుదయించెఁ గొండుక చందురుఁడు (॥ఉండ॥) మింటిమీఁది చందురుఁడు మేదినిపై కలువల నంటు సేసెనట యేఁటి నాటకములే కంటిచూపు కలువల కలకకోరిచెఁ బైఁడి- వంటిమేని జవరాలి వదన చందురుఁడు (॥ఉండ॥) జలధిలో జనియించి చందురుఁడె పగలాయ జలజములకు నేఁటి శాంతములే మెలుఁతమోమై నేఁడు మెత్తనికరతలము- జలజానఁ బవళించెఁ జక్కని చందురుఁడు (॥ఉండ॥) చింకచందురుఁడు కందుఁజీఁకటి మైచీఁకటే యింకఁజేసి పారఁదోలీనేఁటిపొందులే వేంకటేశుని కౌఁగిట వెలఁదిమోమై నేఁడు వంక నెరిచీఁకటి వలఁచె జందురుఁడు English(||pallavi||) uṁḍavaddā yiḍuvaṁṭi vŏḍigālanu sanu- gŏṁḍalabai nudayiṁchĕm̐ gŏṁḍuga saṁdurum̐ḍu (||uṁḍa||) miṁṭimīm̐di saṁdurum̐ḍu medinibai kaluvala naṁṭu sesĕnaḍa yem̐ṭi nāḍagamule kaṁṭisūbu kaluvala kalagagorisĕm̐ baim̐ḍi- vaṁṭimeni javarāli vadana saṁdurum̐ḍu (||uṁḍa||) jaladhilo janiyiṁchi saṁdurum̐ḍĕ pagalāya jalajamulagu nem̐ṭi śhāṁtamule mĕlum̐tamomai nem̐ḍu mĕttanigaradalamu- jalajānam̐ bavaḽiṁchĕm̐ jakkani saṁdurum̐ḍu (||uṁḍa||) siṁkasaṁdurum̐ḍu kaṁdum̐jīm̐kaḍi maisīm̐kaḍe yiṁkam̐jesi pāram̐dolīnem̐ṭibŏṁdule veṁkaḍeśhuni kaum̐giḍa vĕlam̐dimomai nem̐ḍu vaṁka nĕrisīm̐kaḍi valam̐sĕ jaṁdurum̐ḍu