Title (Indic)ఉండనుండఁ జవులౌను వువిదల వలపులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఉండనుండఁ జవులౌను వువిదల వలపులు మెండుగ నాపె నీతో మేలమాడీఁ గాని (॥ఉండ॥) పలుకకుండఁగ నీతోఁ బంతమా ఆపె కేమి తలపోఁత పరాకునఁ దగిలున్నది బలిమికాఁడవు నీవు పట్టి పెనఁగఁగరాదా మలసి యాపె నీతో మాఁటలాడీఁగాని (॥ఉండ॥) యెదురుకొనక నీతో నెమ్మెలా యాపెకేమి వుదుటు మదమునను వోలలాడీని చదురుకాఁడవు నీవు చనవులియ్యఁగరాదా పొదిగి యాపె నీతో భోగించీఁగాని (॥ఉండ॥) సేవలు సేయక నీతో సిగ్గులా ఆపెకేమి నీవిధాలు దెలుసుకో నిలుచున్నది భావించి శ్రీ వేంకటేశ పడఁతిఁ గూడితి విట్టె వేవేలుగా నాపై నిన్ను వెలయించీఁగాని English(||pallavi||) uṁḍanuṁḍam̐ javulaunu vuvidala valabulu mĕṁḍuga nābĕ nīdo melamāḍīm̐ gāni (||uṁḍa||) palugaguṁḍam̐ga nīdom̐ baṁtamā ābĕ kemi talabom̐ta parāgunam̐ dagilunnadi balimigām̐ḍavu nīvu paṭṭi pĕnam̐gam̐garādā malasi yābĕ nīdo mām̐ṭalāḍīm̐gāni (||uṁḍa||) yĕdurugŏnaga nīdo nĕmmĕlā yābĕgemi vuduḍu madamunanu volalāḍīni sadurugām̐ḍavu nīvu sanavuliyyam̐garādā pŏdigi yābĕ nīdo bhogiṁchīm̐gāni (||uṁḍa||) sevalu seyaga nīdo siggulā ābĕgemi nīvidhālu dĕlusugo nilusunnadi bhāviṁchi śhrī veṁkaḍeśha paḍam̐tim̐ gūḍidi viṭṭĕ vevelugā nābai ninnu vĕlayiṁchīm̐gāni