Title (Indic)ఉండనుండఁ దరితీపు లొగరాయఁగా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఉండనుండఁ దరితీపు లొగరాయఁగా పండిన వలపులెల్లాఁ బచ్చియాయఁగా (॥ఉండ॥) వాలాయించి మాయింటికే వచ్చేనన్నవాఁడు నేఁడు లేలే ఆకెయింటి కేఁగె లెస్సాయఁగా నాలిసేసి నన్ను నింత నమ్మించి యిట్టె తాను తాలిమిఁ బరాకు సేసిఁ దగవాయఁగా (॥ఉండ॥) యీరీతి నేనాడినట్టి యేకతపుముచ్చటలు మేరతో నాకెకుఁ జెప్ప మెచ్చాయఁగా పారితెంచి త త్తరానఁ బానువుమీఁదికి వచ్చి జారువలపులు చల్లీ సంగతాయఁగా (॥ఉండ॥) నాకు లోనై యింతలోనే నగుతానే నన్నుఁ గూడి అకెను నాతోనే తిట్టీ నరుదాయఁగా పైకొని శ్రీవేంకటాద్రిపతిగాన యీమాయలు జోకతోఁ దనకే చెల్లు సోద్యమాయఁగా English(||pallavi||) uṁḍanuṁḍam̐ daridību lŏgarāyam̐gā paṁḍina valabulĕllām̐ bachchiyāyam̐gā (||uṁḍa||) vālāyiṁchi māyiṁṭige vachchenannavām̐ḍu nem̐ḍu lele āgĕyiṁṭi kem̐gĕ lĕssāyam̐gā nālisesi nannu niṁta nammiṁchi yiṭṭĕ tānu tālimim̐ barāgu sesim̐ dagavāyam̐gā (||uṁḍa||) yīrīdi nenāḍinaṭṭi yegadabumuchchaḍalu merado nāgĕgum̐ jĕppa mĕchchāyam̐gā pāridĕṁchi ta ttarānam̐ bānuvumīm̐digi vachchi jāruvalabulu sallī saṁgadāyam̐gā (||uṁḍa||) nāgu lonai yiṁtalone nagudāne nannum̐ gūḍi agĕnu nādone tiṭṭī narudāyam̐gā paigŏni śhrīveṁkaḍādribadigāna yīmāyalu jogadom̐ danage sĕllu sodyamāyam̐gā