Title (Indic)ఉండనిమ్మననే నన్ను వూరకే యీడ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఉండనిమ్మననే నన్ను వూరకే యీడ చండివడీ నేమన్నా చాయల యీగుణము (॥ఉండ॥) తనతో నే నవ్వఁబోతే తతిగొనీ సిగ్గులు చెనకి చేయంటఁబోతేఁ జెమరించీని మనసునఁ దలఁచితే మర్మములు గరఁగీ వెనకటిపొందే చాలు వెఱతు నే నిఁకను (॥ఉండ॥) దగ్గరి కూచుండఁబోతేఁ దమకించీఁ దనువు వెగ్గళించి చూడఁబోతే వెరగయ్యీని నిగ్గుల మాటడఁబోతే నిలువెల్లాఁ బులకించీ అగ్గమైతిఁ దొల్లె తన కాయనాయ నిఁకను (॥ఉండ॥) రతులు మెచ్చఁగఁబోతే రాఁగీఁ బెదవులు యితవై కాఁగిలించితే నేకమైతిని సతమై శ్రీ వేంకటాద్రిసరసుఁడు గూడె నన్ను అతిమోహమున మించినననేల యిఁకను English(||pallavi||) uṁḍanimmanane nannu vūrage yīḍa saṁḍivaḍī nemannā sāyala yīguṇamu (||uṁḍa||) tanado ne navvam̐bode tadigŏnī siggulu sĕnagi seyaṁṭam̐bodem̐ jĕmariṁchīni manasunam̐ dalam̐side marmamulu garam̐gī vĕnagaḍibŏṁde sālu vĕṟadu ne nim̐kanu (||uṁḍa||) daggari kūsuṁḍam̐bodem̐ damagiṁchīm̐ danuvu vĕggaḽiṁchi sūḍam̐bode vĕragayyīni niggula māḍaḍam̐bode niluvĕllām̐ bulagiṁchī aggamaidim̐ dŏllĕ tana kāyanāya nim̐kanu (||uṁḍa||) radulu mĕchcham̐gam̐bode rām̐gīm̐ bĕdavulu yidavai kām̐giliṁchide negamaidini sadamai śhrī veṁkaḍādrisarasum̐ḍu gūḍĕ nannu adimohamuna miṁchinananela yim̐kanu