Title (Indic)ఉండఁ బాసీ నడవిలో వొకతె నేను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఉండఁ బాసీ నడవిలో వొకతె నేను ఎండలు నీడలు గాసీ నేమి సేతురా (॥ఉండ॥) చిన్నినానడుము చూచి సింహము దగ్గరెనంటా ఉన్నతపుఁ గుచముల కొరసెఁ గరి మున్నిటి పొందులు వైరమును జేసె మృగపతి యిన్నిటికి నగ్గమైతి నేమి సేతురా (॥ఉండ॥) నిండు నా నడపు చూచి నెమలి దగ్గరి వచ్చె బండు నేసి నారుసూచి పాయదు పాము రెండుఁ జూచి పగయుఁ గూరిమి దోఁచె నింతలోనే యిండె వట్టె నిన్నిటికి నేమి సేతురా (॥ఉండ॥) కోరి నాపలుకు విని కోవిల దగ్గర వచ్చె చేరీ నామోవికిదె చిలుక నేఁడు గారవాన నిన్నియు వేంకటగిరి విభుఁడా యేరా యిట్టె చేకొంటివేమి సేతురా English(||pallavi||) uṁḍam̐ bāsī naḍavilo vŏgadĕ nenu ĕṁḍalu nīḍalu gāsī nemi sedurā (||uṁḍa||) sinninānaḍumu sūsi siṁhamu daggarĕnaṁṭā unnadabum̐ gusamula kŏrasĕm̐ gari munniḍi pŏṁdulu vairamunu jesĕ mṛgabadi yinniḍigi naggamaidi nemi sedurā (||uṁḍa||) niṁḍu nā naḍabu sūsi nĕmali daggari vachchĕ baṁḍu nesi nārusūsi pāyadu pāmu rĕṁḍum̐ jūsi pagayum̐ gūrimi dom̐sĕ niṁtalone yiṁḍĕ vaṭṭĕ ninniḍigi nemi sedurā (||uṁḍa||) kori nābalugu vini kovila daggara vachchĕ serī nāmovigidĕ siluga nem̐ḍu gāravāna ninniyu veṁkaḍagiri vibhum̐ḍā yerā yiṭṭĕ segŏṁṭivemi sedurā