Title (Indic)ఉల్లములో తలపోఁత నోలలాడుచున్నదాన WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఉల్లములో తలపోఁత నోలలాడుచున్నదాన వెల్లవిరిగాఁ జెప్పవే వేడుకయ్యీఁ జెలియా (॥ఉల్ల॥) వచ్చునొకో ఆతఁడు నా వాకిటికి నెప్పుడైనా మెచ్చునొకో నాతోను మేలము లాడి యిచ్చునొకో చనవు నా కిందరిలో నా నేఁడు హెచ్చెఁ గోరికలు నాలో నేముందునే చెలియా (॥ఉల్ల॥) కందునొకో యాతనిఁ గన్నులయెదుట నేను విందునొకో మాఁటలు వీనులారను పొందునోకో నాకాఁగిట బుజ్జగించి ఇట్టె తాను సందడించీఁ దమకమెంచఁగరాదే చెలియా (॥ఉల్ల॥) యెక్కునొకొ నా సేవ లిన్నియును నాతనికి చొక్కునొకొ నా రతుల సులభానను దక్కునొకొ యనఁగానే తానె శ్రీవేంకటేశుఁడు ఇక్కడికె విచ్చేసి యేలె నన్నుఁ జెలియా English(||pallavi||) ullamulo talabom̐ta nolalāḍusunnadāna vĕllavirigām̐ jĕppave veḍugayyīm̐ jĕliyā (||ulla||) vachchunŏgo ādam̐ḍu nā vāgiḍigi nĕppuḍainā mĕchchunŏgo nādonu melamu lāḍi yichchunŏgo sanavu nā kiṁdarilo nā nem̐ḍu hĕchchĕm̐ gorigalu nālo nemuṁdune sĕliyā (||ulla||) kaṁdunŏgo yādanim̐ gannulayĕduḍa nenu viṁdunŏgo mām̐ṭalu vīnulāranu pŏṁdunogo nāgām̐giḍa bujjagiṁchi iṭṭĕ tānu saṁdaḍiṁchīm̐ damagamĕṁcham̐garāde sĕliyā (||ulla||) yĕkkunŏgŏ nā seva linniyunu nādanigi sŏkkunŏgŏ nā radula sulabhānanu dakkunŏgŏ yanam̐gāne tānĕ śhrīveṁkaḍeśhum̐ḍu ikkaḍigĕ vichchesi yelĕ nannum̐ jĕliyā