Title (Indic)ఉడివోని సంసారాన నున్నారము నట్ట WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఉడివోని సంసారాన నున్నారము నట్ట- నడుమాయ నవ్వులకు నాబ్రతుకు (॥ఉడి॥) పుట్టని జన్మము లేదు పొందని భోగము లేదు నెట్టన మాయలఁ జిక్కి నేఁ దొల్లి కొట్టఁగొన కెక్కలేదు కోరి మొదలను లేదు నట్టనడుమ నున్నది నాబ్రదుకు (॥ఉడి॥) చొరని లోకము లేదు చూడని విద్యలు లేదు నిరతి మాయలఁ జిక్కి నేఁ దొల్లి దరి చేరుటా లేదు తగులు లేదు నానాఁడు నరకమే కురిసీని నాబ్రదుకు (॥ఉడి॥) చేయని కర్మము లేదు చెందని ఫలము లేదు నీయిచ్చ మాయలఁ జిక్కి నేఁ దొల్లి యీయెడ శ్రీవేంకటేశ యిట్టె నీవు నన్నేలఁగా నాయిచ్చ సఫలమాయ నాబ్రదుకు English(||pallavi||) uḍivoni saṁsārāna nunnāramu naṭṭa- naḍumāya navvulagu nābradugu (||uḍi||) puṭṭani janmamu ledu pŏṁdani bhogamu ledu nĕṭṭana māyalam̐ jikki nem̐ dŏlli kŏṭṭam̐gŏna kĕkkaledu kori mŏdalanu ledu naṭṭanaḍuma nunnadi nābradugu (||uḍi||) sŏrani logamu ledu sūḍani vidyalu ledu niradi māyalam̐ jikki nem̐ dŏlli dari seruḍā ledu tagulu ledu nānām̐ḍu naragame kurisīni nābradugu (||uḍi||) seyani karmamu ledu sĕṁdani phalamu ledu nīyichcha māyalam̐ jikki nem̐ dŏlli yīyĕḍa śhrīveṁkaḍeśha yiṭṭĕ nīvu nannelam̐gā nāyichcha saphalamāya nābradugu