Title (Indic)ఉదయించె నతఁడు నీ వుదయించ వేలయ్య WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఉదయించె నతఁడు నీ వుదయించ వేలయ్య మదిరాక్షిఁ గూడి యిట్టె మన్నించవయ్యా (॥ఉద॥) జలజబంధుఁ డతఁడు జలజాక్షి వదనపు జలజబాంధవుఁడవు సరుస నీవు అలరి నాకాశమందె యతనికి విహరించఁ గలికి నడిమియాకస మిదె నీకు (॥ఉద॥) చీఁకటివైరి యతఁడు చెలియమనసులోని చీఁకటివైరివి నీవు చేచేతనే ఆఁక జక్కవలఁ గూర్చు నతఁడు నీ వీడ నైతె కాఁక చనుజక్క వలఁ గలపఁగ వలదా (॥ఉద॥) దినరా జతఁడు భూమిఁ దెరవపాలికి నీవు దినదినరాజవు తేజమనను ఘనుఁడ శ్రీవెంకటేశ కాంతఁ గూడితివి నేఁడు గనియై యాతఁడు సూర్యకాంతమునఁ గూడెను English(||pallavi||) udayiṁchĕ nadam̐ḍu nī vudayiṁcha velayya madirākṣhim̐ gūḍi yiṭṭĕ manniṁchavayyā (||uda||) jalajabaṁdhum̐ ḍadam̐ḍu jalajākṣhi vadanabu jalajabāṁdhavum̐ḍavu sarusa nīvu alari nāgāśhamaṁdĕ yadanigi vihariṁcham̐ galigi naḍimiyāgasa midĕ nīgu (||uda||) sīm̐kaḍivairi yadam̐ḍu sĕliyamanasuloni sīm̐kaḍivairivi nīvu sesedane ām̐ka jakkavalam̐ gūrsu nadam̐ḍu nī vīḍa naidĕ kām̐ka sanujakka valam̐ galabam̐ga valadā (||uda||) dinarā jadam̐ḍu bhūmim̐ dĕravabāligi nīvu dinadinarājavu tejamananu ghanum̐ḍa śhrīvĕṁkaḍeśha kāṁtam̐ gūḍidivi nem̐ḍu ganiyai yādam̐ḍu sūryagāṁtamunam̐ gūḍĕnu