Title (Indic)ఉపచరించఁగరాదా వువిద గడు నలసె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఉపచరించఁగరాదా వువిద గడు నలసె నెపమున వురుటెల్ల నెరపీ నీ మీఁదను (॥ఉప॥) నలినాక్షి గరిడిలో నంటునఁ గేళిసేసె మలసి చెక్కులను చెమటగారఁగా వల పందులోనె చల్లి వాసనగుబ్బలు మోఁపి నలువంక నీకు నభినయము చూపీని (॥ఉప॥) తెరమఱఁగున వచ్చి దేశిశుద్దాంగములను సరవి నాడి చూపులు సళుపుచును తిరుపుగొని కమ్మటి తీగెచేతులటు చాఁచి పరగ నంగరంగవైభవము మెరసీని (॥ఉప॥) పదములఁ జిందుజక్కిణి బహుతాళమానముల- నిదె నాట్యమున నిన్ను నింతి మెప్పించె అదన శ్రీవేంకటేశ అలమేలుమంగా నీవు గదిసి చూడఁగా మతిగరఁగించీని English(||pallavi||) ubasariṁcham̐garādā vuvida gaḍu nalasĕ nĕbamuna vuruḍĕlla nĕrabī nī mīm̐danu (||uba||) nalinākṣhi gariḍilo naṁṭunam̐ geḽisesĕ malasi sĕkkulanu sĕmaḍagāram̐gā vala paṁdulonĕ salli vāsanagubbalu mom̐pi naluvaṁka nīgu nabhinayamu sūbīni (||uba||) tĕramaṟam̐guna vachchi deśhiśhuddāṁgamulanu saravi nāḍi sūbulu saḽubusunu tirubugŏni kammaḍi tīgĕsedulaḍu sām̐si paraga naṁgaraṁgavaibhavamu mĕrasīni (||uba||) padamulam̐ jiṁdujakkiṇi bahudāḽamānamula- nidĕ nāṭyamuna ninnu niṁti mĕppiṁchĕ adana śhrīveṁkaḍeśha alamelumaṁgā nīvu gadisi sūḍam̐gā madigaram̐giṁchīni