Title (Indic)ఉపకారి దేవుఁడు అపకారి గాఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఉపకారి దేవుఁడు అపకారి గాఁడు (॥ఉప॥) దేహం బొసఁగెను దేవుఁడు తనుఁ దెలియఁగ శాస్త్రము గడియించె దేహాంతరాత్ముఁడు మరి దేహచైతన్యుఁడా దాను దేహి యేలోకంబున కేఁగిన దేవుఁడు దా వెంటనే యేఁగును దేహి కోరినట్టే కమ్మర దేవుఁ డనుమతి ఇచ్చీఁ గాన (॥ఉప॥) చేయుటకును చేయకమానుటకును జీవుఁడు స్వతంత్రుఁడా యంటేను కాయపుసుఖములు గోరఁగ గర్తట కడగనుటకుఁ గర్త గాఁడా యీయెడ నాయెడ నంతర్యామే యిన్నిటికినిఁ బ్రేరకుఁడింతే దాయక పాయక తనతలఁపుకొలఁది దైవమే సృజియించీఁ గాన (॥ఉప॥) ఇవి యెరిఁగి చిత్తమా నీ వితనందే అభిరతి సేయుము సదయుఁడు మనశ్రీవేంకటగిరి సర్వేశ్వరుఁడు సత్యుఁడు మొదలనే యీయర్థము కిరీటితో మొగి నానతి ఇచ్చినాఁడు అదే "నమోఽహం సర్వభూతేషు" అని గీతలలో నున్నది గాన English(||pallavi||) ubagāri devum̐ḍu abagāri gām̐ḍu (||uba||) dehaṁ bŏsam̐gĕnu devum̐ḍu tanum̐ dĕliyam̐ga śhāstramu gaḍiyiṁchĕ dehāṁtarātmum̐ḍu mari dehasaidanyum̐ḍā dānu dehi yelogaṁbuna kem̐gina devum̐ḍu dā vĕṁṭane yem̐gunu dehi korinaṭṭe kammara devum̐ ḍanumadi ichchīm̐ gāna (||uba||) seyuḍagunu seyagamānuḍagunu jīvum̐ḍu svadaṁtrum̐ḍā yaṁṭenu kāyabusukhamulu goram̐ga gardaḍa kaḍaganuḍagum̐ garda gām̐ḍā yīyĕḍa nāyĕḍa naṁtaryāme yinniḍiginim̐ breragum̐ḍiṁte dāyaga pāyaga tanadalam̐pugŏlam̐di daivame sṛjiyiṁchīm̐ gāna (||uba||) ivi yĕrim̐gi sittamā nī vidanaṁde abhiradi seyumu sadayum̐ḍu manaśhrīveṁkaḍagiri sarveśhvarum̐ḍu satyum̐ḍu mŏdalane yīyardhamu kirīḍido mŏgi nānadi ichchinām̐ḍu ade "namo'haṁ sarvabhūdeṣhu" ani gīdalalo nunnadi gāna