Title (Indic)ఉపకారముచేయుట ఊహించుకోవద్దా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఉపకారముచేయుట ఊహించుకోవద్దా కపటము గలిగితే కాదనుట గాక (॥ఉప॥) చన్నులమీఁదిపయ్యద జారఁదీసీనంటాను కన్నుల జంకించేవు కాంతుని నీవు వున్నతపు జక్కవలు వుమ్మడిఁజిక్కివుండఁగాను యెన్నఁగ బాయిట వేయుటెగ్గా యిది (॥ఉప॥) కొప్పు సంపెంగ పువ్వులు కుమ్మరించెనంటాను అప్పుడె యాతని దూరేవౌనే నీవు తప్పకుండా నెరితుమ్మెదలకును జిక్కకుండా వొప్పుగాఁగ దులుపుట వుచితము గాదా (॥ఉప॥) మునుకొని నీపోకముడి విడిచెనంటాను యెనసి శ్రీ వెంకటేశునేల తిట్టేవే ఘనకరికుంభములు కట్టుగాడినుండఁగాను కని మరఁగు దీయుట కడు నేర్పు గాదా English(||pallavi||) ubagāramuseyuḍa ūhiṁchugovaddā kabaḍamu galigide kādanuḍa gāga (||uba||) sannulamīm̐dibayyada jāram̐dīsīnaṁṭānu kannula jaṁkiṁchevu kāṁtuni nīvu vunnadabu jakkavalu vummaḍim̐jikkivuṁḍam̐gānu yĕnnam̐ga bāyiḍa veyuḍĕggā yidi (||uba||) kŏppu saṁpĕṁga puvvulu kummariṁchĕnaṁṭānu appuḍĕ yādani dūrevaune nīvu tappaguṁḍā nĕridummĕdalagunu jikkaguṁḍā vŏppugām̐ga dulubuḍa vusidamu gādā (||uba||) munugŏni nībogamuḍi viḍisĕnaṁṭānu yĕnasi śhrī vĕṁkaḍeśhunela tiṭṭeve ghanagariguṁbhamulu kaṭṭugāḍinuṁḍam̐gānu kani maram̐gu dīyuḍa kaḍu nerbu gādā