Title (Indic)ఉపదేశ మిచ్చెగా వువిద మా కెల్లాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఉపదేశ మిచ్చెగా వువిద మా కెల్లాను యిపుడు నీ మన సాపె యెట్లా నెరిఁగెనో (॥ఉపదేశ॥) కలికి నిన్నునుఁ బాదకమలానఁ బూజించె నెలపై దేవర వని నేము మొక్కఁగా వులివచ్చి నవ్వులతో వున్నాఁడ వందుకునీవు మెలమి నీ మన సాపె యెటులా నెరిఁగెనో (॥ఉపదేశ॥) తరుణి నీకు వుక్కిటితమ్ములాన విందు వెట్టె వొర వని నేము నిన్ను దొడ్డసేయఁగా సరసాన నీవూ నది చవి సేసు కున్నాఁడవు యిరవై నీ మన సాపె యెటులా నెరిఁగెనో (॥ఉపదేశ॥) మగువ నిన్ను బూతుమాఁటలు కొనియాడె నిగిడి యేలికె వని నేము గొల్వఁగా నగుతా శ్రీవెంకటనాథ మమ్ముఁ గూడితివి యెగువ నీ మనసాపె యెటులా నెరిఁగెనో. English(||pallavi||) ubadeśha michchĕgā vuvida mā kĕllānu yibuḍu nī mana sābĕ yĕṭlā nĕrim̐gĕno (||ubadeśha||) kaligi ninnunum̐ bādagamalānam̐ būjiṁchĕ nĕlabai devara vani nemu mŏkkam̐gā vulivachchi navvulado vunnām̐ḍa vaṁdugunīvu mĕlami nī mana sābĕ yĕḍulā nĕrim̐gĕno (||ubadeśha||) taruṇi nīgu vukkiḍidammulāna viṁdu vĕṭṭĕ vŏra vani nemu ninnu dŏḍḍaseyam̐gā sarasāna nīvū nadi savi sesu kunnām̐ḍavu yiravai nī mana sābĕ yĕḍulā nĕrim̐gĕno (||ubadeśha||) maguva ninnu būdumām̐ṭalu kŏniyāḍĕ nigiḍi yeligĕ vani nemu gŏlvam̐gā nagudā śhrīvĕṁkaḍanātha mammum̐ gūḍidivi yĕguva nī manasābĕ yĕḍulā nĕrim̐gĕno.