Title (Indic)తెలిసినవారి కింతా దేవుఁడై యుండు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తెలిసినవారి కింతా దేవుఁడై యుండు కలఁడన్నచోట హరి గలఁ డటుగాన (॥తెలి॥) అందునిందుఁ బోయి శ్రీహరిని వెదకనేల బొందితోడి రూపులెల్లాఁ బొరి నతఁడే కొందరిలోనుండి ఇచ్చుఁ గోరినట్టి యీవులెల్ల కొందరిలో మాటలాడుఁ గొందరిలో నగును (॥తెలి॥) లోన వెలిఁ జూచి పరలోకము వెదకనేల యేనెలవైన వైకుంఠ మెదుట నదె పూని వొకచోట నెండ పొడచూపు నక్కడనే నానిన వెన్నెల గాసు నానారీతులౌను (॥తెలి॥) చొక్కిచొక్కి యానందసుఖము వెదకనేల మక్కువఁ దా శాంతుఁడైతే మతిలో నదె యెక్కువతో శ్రీవేంకటేశ్వరు దాఁసుడ నైతి వొక్కఁడే మాకిన్నిటికిఁ నొడయఁడై నిలిచె English(||pallavi||) tĕlisinavāri kiṁtā devum̐ḍai yuṁḍu kalam̐ḍannasoḍa hari galam̐ ḍaḍugāna (||tĕli||) aṁduniṁdum̐ boyi śhrīharini vĕdaganela bŏṁdidoḍi rūbulĕllām̐ bŏri nadam̐ḍe kŏṁdarilonuṁḍi ichchum̐ gorinaṭṭi yīvulĕlla kŏṁdarilo māḍalāḍum̐ gŏṁdarilo nagunu (||tĕli||) lona vĕlim̐ jūsi paralogamu vĕdaganela yenĕlavaina vaiguṁṭha mĕduḍa nadĕ pūni vŏgasoḍa nĕṁḍa pŏḍasūbu nakkaḍane nānina vĕnnĕla gāsu nānārīdulaunu (||tĕli||) sŏkkisŏkki yānaṁdasukhamu vĕdaganela makkuvam̐ dā śhāṁtum̐ḍaide madilo nadĕ yĕkkuvado śhrīveṁkaḍeśhvaru dām̐suḍa naidi vŏkkam̐ḍe māginniḍigim̐ nŏḍayam̐ḍai nilisĕ