Title (Indic)తప్పులెంచవని నిన్ను దగ్గరితి నిటుగాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తప్పులెంచవని నిన్ను దగ్గరితి నిటుగాక వొప్పగించే బీరాల కోపుదునా నేను (॥తప్పు॥) చిక్కని నీనవ్వులకు చేసేటి చేఁతలకు యెక్కువగా నింతేసి మోహించితిఁగాక తక్కుల నీగుట్లకు తచ్చన సన్నలకు వొక్కమాఁటే యీపనులకోపుదునా నేను (॥తప్పు॥) కన్నుల నీమొక్కులకు కరుణారసానకు కన్నెనయ్యే నీకు తాళి గట్టితిఁగాక మిన్నక నీమేకులకు మేరలు మీరుటకు వున్నతి నీరాఁపులకు నోపుదునా నేను (॥తప్పు॥) కలిసితివి రతికిఁ గడలేని మన్ననకు పిలిచి నీకే సేస వెట్టితిఁగాక యెలమి శ్రీవెంకటేశ యిట్టి నీవినయాలకు వొళవుగా సిగ్గువడ నోపుదునా నేను English(||pallavi||) tappulĕṁchavani ninnu daggaridi niḍugāga vŏppagiṁche bīrāla kobudunā nenu (||tappu||) sikkani nīnavvulagu seseḍi sem̐talagu yĕkkuvagā niṁtesi mohiṁchidim̐gāga takkula nīguṭlagu tachchana sannalagu vŏkkamām̐ṭe yībanulagobudunā nenu (||tappu||) kannula nīmŏkkulagu karuṇārasānagu kannĕnayye nīgu tāḽi gaṭṭidim̐gāga minnaga nīmegulagu meralu mīruḍagu vunnadi nīrām̐pulagu nobudunā nenu (||tappu||) kalisidivi radigim̐ gaḍaleni mannanagu pilisi nīge sesa vĕṭṭidim̐gāga yĕlami śhrīvĕṁkaḍeśha yiṭṭi nīvinayālagu vŏḽavugā sigguvaḍa nobudunā nenu