Title (Indic)తప్పులెల్ల వొప్పులాయ తతి వచ్చెను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తప్పులెల్ల వొప్పులాయ తతి వచ్చెను చప్పని వలపులకు చవివుట్టెఁ గదవే (॥తప్పు॥) మచ్చిక నీ కటు చూపి మాటలు నీతో నాడి పచ్చికస్తూరి యతఁడు పైఁ బూసెను యిచ్చుకుఁడు గాఁడంటా నింటికిని రాఁడంటా యెచ్చి యిన్నాళ్లు దూరితి విఁక బాసెఁగదవే (॥తప్పు॥) కందువ మర్మము లంటి కప్పురము నోటి కిచ్చి గందము వూసి యాతఁడు కరఁగించె ను పొందులు మరపఁడంటా పూఁచి నీతో నవ్వఁడంటా నింద లాడుదు వందుకె నీకు మొక్కెఁగదవే (॥తప్పు॥) చెక్కులు నీకు నొక్కి సేద లన్నియునుఁ దేర్చి యిక్కువ శ్రీవేంకటేశుఁ డిటు గూడెను యెక్కుడాయ రతులంటా నింతయెలయించెనంటా మిక్కిలి ఇఁక నిందుకే మెచ్చవలెఁ గదవే English(||pallavi||) tappulĕlla vŏppulāya tadi vachchĕnu sappani valabulagu savivuṭṭĕm̐ gadave (||tappu||) machchiga nī kaḍu sūbi māḍalu nīdo nāḍi pachchigastūri yadam̐ḍu paim̐ būsĕnu yichchugum̐ḍu gām̐ḍaṁṭā niṁṭigini rām̐ḍaṁṭā yĕchchi yinnāḽlu dūridi vim̐ka bāsĕm̐gadave (||tappu||) kaṁduva marmamu laṁṭi kappuramu noḍi kichchi gaṁdamu vūsi yādam̐ḍu karam̐giṁchĕ nu pŏṁdulu marabam̐ḍaṁṭā pūm̐si nīdo navvam̐ḍaṁṭā niṁda lāḍudu vaṁdugĕ nīgu mŏkkĕm̐gadave (||tappu||) sĕkkulu nīgu nŏkki seda lanniyunum̐ dersi yikkuva śhrīveṁkaḍeśhum̐ ḍiḍu gūḍĕnu yĕkkuḍāya radulaṁṭā niṁtayĕlayiṁchĕnaṁṭā mikkili im̐ka niṁduge mĕchchavalĕm̐ gadave