Title (Indic)తను నమ్మివున్నదాన తడవేల సేసీనే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తను నమ్మివున్నదాన తడవేల సేసీనే ఘనుఁడు తానిన్నిటాను కరుణించు మనవే (॥తను॥) చనవులు సేసుకొని సరసములాడితి ననుపునఁ బతితోను నువ్వనవ్వితి పెనఁగి పెనఁగి కడుఁ బ్రియములెల్లాఁ జెప్పితి యెనయఁగఁ దనమన సెప్పడు గరఁగీనే (॥తను॥) యిచ్చకములే నెరపి యింటికి రమ్మంటివి విచ్చన విడిగా మొక్కితి వేఁడుకొంటిని అచ్చపుఁ జుట్టరికము లన్నియు విన్నవించితి తచ్చి నాపై నెన్నఁ దిఁక దయ దలఁచీనే (॥తను॥) చెలరేఁగి చెటరేఁగి సేవ లిట్టె సేసితి కలపు కొలుతనానఁ గాఁగిలించితి యెలమి శ్రీవేంకటేశుఁ డింతలో వచ్చి నన్నేలె తలకొని నన్ను నెందాఁకా నెలయించీనే English(||pallavi||) tanu nammivunnadāna taḍavela sesīne ghanum̐ḍu tāninniḍānu karuṇiṁchu manave (||tanu||) sanavulu sesugŏni sarasamulāḍidi nanubunam̐ badidonu nuvvanavvidi pĕnam̐gi pĕnam̐gi kaḍum̐ briyamulĕllām̐ jĕppidi yĕnayam̐gam̐ danamana sĕppaḍu garam̐gīne (||tanu||) yichchagamule nĕrabi yiṁṭigi rammaṁṭivi vichchana viḍigā mŏkkidi vem̐ḍugŏṁṭini achchabum̐ juṭṭarigamu lanniyu vinnaviṁchidi tachchi nābai nĕnnam̐ dim̐ka daya dalam̐sīne (||tanu||) sĕlarem̐gi sĕḍarem̐gi seva liṭṭĕ sesidi kalabu kŏludanānam̐ gām̐giliṁchidi yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalo vachchi nannelĕ talagŏni nannu nĕṁdām̐kā nĕlayiṁchīne