Title (Indic)తమకాన నున్నవాఁడు దండ నాతఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తమకాన నున్నవాఁడు దండ నాతఁడు సమరతులకుఁ జేయి చాఁచరాదా యిపుడు (॥తమ॥) కత లేమిచెప్పేవే కాంతునితో వేగినంతా రతులకుఁ దెరవేయరాదా యిఁక పతిగా నేమినవ్వేవే పలుమారు నతనితో యితవుగా బాగా లొత్తిఇయ్యరాదా ఇపుడు (॥తమ॥) భ్రమల నేల పెట్టేవే బడిబడి నెందాఁకా జమళి నీవే ముందు చనవీరాదా అమరె నేమి చూచేవే అతనిది క్కప్సటిని క్రమముగాఁ గాఁగిలించు గక్కన నీ విపుడు (॥తమ॥) చెక్కులేమి నొక్కేవే శ్రీవేంకటేశ్వరుని దక్కఁగూడితి వీ మేలు తలఁతుగాక మక్కువల నిఁకనేమి మర్మాలు సోదించేవే చిక్కఁగా సరసములు చిమ్మఁగదే యిపుడు English(||pallavi||) tamagāna nunnavām̐ḍu daṁḍa nādam̐ḍu samaradulagum̐ jeyi sām̐sarādā yibuḍu (||tama||) kada lemisĕppeve kāṁtunido veginaṁtā radulagum̐ dĕraveyarādā yim̐ka padigā neminavveve palumāru nadanido yidavugā bāgā lŏttiiyyarādā ibuḍu (||tama||) bhramala nela pĕṭṭeve baḍibaḍi nĕṁdām̐kā jamaḽi nīve muṁdu sanavīrādā amarĕ nemi sūseve adanidi kkapsaḍini kramamugām̐ gām̐giliṁchu gakkana nī vibuḍu (||tama||) sĕkkulemi nŏkkeve śhrīveṁkaḍeśhvaruni dakkam̐gūḍidi vī melu talam̐tugāga makkuvala nim̐kanemi marmālu sodiṁcheve sikkam̐gā sarasamulu simmam̐gade yibuḍu