Title (Indic)తలఁచినప్పుడు వచ్చు దయ యెప్పుడూఁ దలఁచు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తలఁచినప్పుడు వచ్చు దయ యెప్పుడూఁ దలఁచు కలసిన బంధువుఁడు కమలారమణుఁడే (॥తలఁ॥) ఆతుమలోననే వుండు అన్నిటాఁ బాయనివాఁడు యీతల నాతలఁ దానే యేమైనా నిచ్చు చేతిలోఁ జేసే కర్మాలు చెడనియ్యఁ డెన్నఁడును ఆతుర బంధువుఁడు హరి యొక్కఁడే (॥తలఁ॥) నిచ్చలు విందులు వెట్టు నెలఁతల నొడఁగూర్చు యిచ్చెరిఁగి కప్ప గోకలెందైనాఁ దెచ్చు మెచ్చు నేమిటికినైనా యిచ్చినవి గైకొను ముచ్చటైన బంధువుఁడు ముకుందుఁడే (॥తలఁ॥) తోడునీడై వచ్చు మరి దొరతనము సేయించు పాడితోఁ బంచేంద్రియాలఁ బంపు సేయించు మేడెపు సంసారములో మించిన నిద్ర దెలుపు వేడుక బంధువుఁడు శ్రీవేంకటేశుఁడే English(||pallavi||) talam̐sinappuḍu vachchu daya yĕppuḍūm̐ dalam̐su kalasina baṁdhuvum̐ḍu kamalāramaṇum̐ḍe (||talam̐||) ādumalonane vuṁḍu anniḍām̐ bāyanivām̐ḍu yīdala nādalam̐ dāne yemainā nichchu sedilom̐ jese karmālu sĕḍaniyyam̐ ḍĕnnam̐ḍunu ādura baṁdhuvum̐ḍu hari yŏkkam̐ḍe (||talam̐||) nichchalu viṁdulu vĕṭṭu nĕlam̐tala nŏḍam̐gūrsu yichchĕrim̐gi kappa gogalĕṁdainām̐ dĕchchu mĕchchu nemiḍiginainā yichchinavi gaigŏnu muchchaḍaina baṁdhuvum̐ḍu muguṁdum̐ḍe (||talam̐||) toḍunīḍai vachchu mari dŏradanamu seyiṁchu pāḍidom̐ baṁcheṁdriyālam̐ baṁpu seyiṁchu meḍĕbu saṁsāramulo miṁchina nidra dĕlubu veḍuga baṁdhuvum̐ḍu śhrīveṁkaḍeśhum̐ḍe