Title (Indic)తలకొని యేల యెడతాఁకించేవు చెలులను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తలకొని యేల యెడతాఁకించేవు చెలులను వెలయ మీ సరితలు వింటా నుండేము (॥తల॥) సముకాననే నిన్ను జంకించి చూచేటి రమణుల నేము మేరకుఁ దెచ్చేమా తమకించి నీవె యాకతాన వేఁడుకొనవయ్య తమితోడ నేము తెరదండ నుండేము (॥తల॥) బడిబడి నీతో నొడ్డాఁబట్టా మాటలాడేటి పడఁతుల మేము వొడఁబరచేమా తొడిఁబడ నీవే పొందులు చేసుకొనవయ్య తడఁబడక మలఁగుదాపున నుండేము (॥తల॥) రతివేళ నిన్నుఁ గడురాపుగా నలయించేటి అతివల నంతేసి కాదనఁగలమా యితవై శ్రీవేంకటేశ యిట్టే నీవెనసితివి మతిమఱవక నీమన్నన నుండేము English(||pallavi||) talagŏni yela yĕḍadām̐kiṁchevu sĕlulanu vĕlaya mī saridalu viṁṭā nuṁḍemu (||tala||) samugānane ninnu jaṁkiṁchi sūseḍi ramaṇula nemu meragum̐ dĕchchemā tamagiṁchi nīvĕ yāgadāna vem̐ḍugŏnavayya tamidoḍa nemu tĕradaṁḍa nuṁḍemu (||tala||) baḍibaḍi nīdo nŏḍḍām̐baṭṭā māḍalāḍeḍi paḍam̐tula memu vŏḍam̐barasemā tŏḍim̐baḍa nīve pŏṁdulu sesugŏnavayya taḍam̐baḍaga malam̐gudābuna nuṁḍemu (||tala||) radiveḽa ninnum̐ gaḍurābugā nalayiṁcheḍi adivala naṁtesi kādanam̐galamā yidavai śhrīveṁkaḍeśha yiṭṭe nīvĕnasidivi madimaṟavaga nīmannana nuṁḍemu