Title (Indic)తలపట్టు వెట్టుకొన్న తరుణీమణి నిన్ను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తలపట్టు వెట్టుకొన్న తరుణీమణి నిన్ను నలసి వేమరు దూరు నాకె వో యీకె (॥తల॥) గొప్పలయిన గుబ్బలవేఁగుల నలయు సతులు కొప్పులు జారఁగఁ దన్నుఁ గొలిచి రాఁగా చెప్పరాని నటనల సింగారపుఁ దోఁటలోన అప్పుడు నిన్నుఁ జూచిన ఆకెవో యీకె (॥తల॥) పాదపుఁబెండేలు మ్రోయఁ బడఁతులిరువంకల సేదలు దేరుచుఁ దనచెంగట రాఁగా మేదకపు తొలుకరి మెఱుఁగంటా నీ పప్పు- డాదిగొని చూచిన ఆకెవో యీకె (॥తల॥) బంగారు చెరఁగుచీర పయ్యెదకొంగు దూలఁగా అంగన వొకతె దనకాకు చుట్టీఁగా ఇంగితమెఱిఁగి వేంకటేశుఁడ నిన్నుఁ గలసి అంగడినెల్లఁ బెట్టిన ఆకెవో యీకె English(||pallavi||) talabaṭṭu vĕṭṭugŏnna taruṇīmaṇi ninnu nalasi vemaru dūru nāgĕ vo yīgĕ (||tala||) gŏppalayina gubbalavem̐gula nalayu sadulu kŏppulu jāram̐gam̐ dannum̐ gŏlisi rām̐gā sĕpparāni naḍanala siṁgārabum̐ dom̐ṭalona appuḍu ninnum̐ jūsina āgĕvo yīgĕ (||tala||) pādabum̐bĕṁḍelu mroyam̐ baḍam̐tuliruvaṁkala sedalu derusum̐ danasĕṁgaḍa rām̐gā medagabu tŏlugari mĕṟum̐gaṁṭā nī pappu- ḍādigŏni sūsina āgĕvo yīgĕ (||tala||) baṁgāru sĕram̐gusīra payyĕdagŏṁgu dūlam̐gā aṁgana vŏgadĕ danagāgu suṭṭīm̐gā iṁgidamĕṟim̐gi veṁkaḍeśhum̐ḍa ninnum̐ galasi aṁgaḍinĕllam̐ bĕṭṭina āgĕvo yīgĕ