Title (Indic)తడవము తాఁకము తానే చెనకీ నన్ను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తడవము తాఁకము తానే చెనకీ నన్ను కడఁగి యీతని లాగు కంటివటే చెలియ (॥తడ॥) పొరిఁబొరి వనములో పూవులు నేఁగోయఁ గాను సరసము లేమాడీనే జాజరకాఁడు సరస నే నింతులతో జలకేలి సేయఁగాను దరినుం డేమినవ్వీనే తచ్చనకాఁడు (॥తడ॥) మేడలోనుండి జవ్వాది మేఁ బూసుకొనఁగాను వీడె మేవియ్య వచ్చీనే వేడుకకాఁడు నీడ చూచి కస్తూరిని నే బొట్టు వెట్టుకోఁగాను వోడక యెంత మెచ్చీనే వుబ్బరికాఁడు (॥తడ॥) యెన్నికతోఁ గిన్దెర వాయించుకొంటా నే నుండఁగా చన్నులేల చూచీనే జాణకాఁడు ఇన్నిటా శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె కన్ను లెంత జంకించీనే గద్దరి కాఁడు English(||pallavi||) taḍavamu tām̐kamu tāne sĕnagī nannu kaḍam̐gi yīdani lāgu kaṁṭivaḍe sĕliya (||taḍa||) pŏrim̐bŏri vanamulo pūvulu nem̐goyam̐ gānu sarasamu lemāḍīne jājaragām̐ḍu sarasa ne niṁtulado jalageli seyam̐gānu darinuṁ ḍeminavvīne tachchanagām̐ḍu (||taḍa||) meḍalonuṁḍi javvādi mem̐ būsugŏnam̐gānu vīḍĕ meviyya vachchīne veḍugagām̐ḍu nīḍa sūsi kastūrini ne bŏṭṭu vĕṭṭugom̐gānu voḍaga yĕṁta mĕchchīne vubbarigām̐ḍu (||taḍa||) yĕnnigadom̐ gindĕra vāyiṁchugŏṁṭā ne nuṁḍam̐gā sannulela sūsīne jāṇagām̐ḍu inniḍā śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐ gūḍĕ kannu lĕṁta jaṁkiṁchīne gaddari kām̐ḍu