Title (Indic)తానే యెఱుఁగును రమణుఁడు తన కెదు రాడేనా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తానే యెఱుఁగును రమణుఁడు తన కెదు రాడేనా నానెనుఁ జెమటలఁ బులకలు నటనకుఁ బనిలేదే (॥తానే॥) కోపమూ కనుల నున్నది కూరిమి మదిలో నున్నది యేపునఁ బతి కింక నుత్తర మేమని చెప్పుదునే తీపులు మాటల నున్నవి తెగువలు కాఁకల నున్నవి రాపుగఁ బతివద్దికి నే రాకుండుట మేలే (॥తానే॥) జంకెల బొమ్మల నున్నవి చనవులు మొక్కుల నున్నవి బింకముతోఁ బేర్కొని తనుఁ బిలువఁగఁ జో టేదే మంకులు వొట్టుల నున్నవి మర్మము పైపై నున్నది యింకా బుద్దులు మి రిఁక నేమని చెప్పేరే (॥తానే॥) వలపులూ కౌఁగిట నున్నవి వాసులు సిగ్గుల నున్నవి తల దడిసెను చలి వాసెను తా నేమనఁ గలఁడే వలె నని శ్రీవేంకటపతి వడదేరిచి ననుఁ గూడెను నిలువున ముంచెను మరపులు నేరములెంచకురే English(||pallavi||) tāne yĕṟum̐gunu ramaṇum̐ḍu tana kĕdu rāḍenā nānĕnum̐ jĕmaḍalam̐ bulagalu naḍanagum̐ banilede (||tāne||) kobamū kanula nunnadi kūrimi madilo nunnadi yebunam̐ badi kiṁka nuttara memani sĕppudune tībulu māḍala nunnavi tĕguvalu kām̐kala nunnavi rābugam̐ badivaddigi ne rāguṁḍuḍa mele (||tāne||) jaṁkĕla bŏmmala nunnavi sanavulu mŏkkula nunnavi biṁkamudom̐ bergŏni tanum̐ biluvam̐gam̐ jo ṭede maṁkulu vŏṭṭula nunnavi marmamu paibai nunnadi yiṁkā buddulu mi rim̐ka nemani sĕppere (||tāne||) valabulū kaum̐giḍa nunnavi vāsulu siggula nunnavi tala daḍisĕnu sali vāsĕnu tā nemanam̐ galam̐ḍe valĕ nani śhrīveṁkaḍabadi vaḍaderisi nanum̐ gūḍĕnu niluvuna muṁchĕnu marabulu neramulĕṁchagure