Title (Indic)తానే యెఱుఁగును అన్నిదగవులు దయఁదలంచీ నిపుడె రమణుఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తానే యెఱుఁగును అన్నిదగవులు దయఁదలంచీ నిపుడె రమణుఁడు పూని యొకమాఁ టెచ్చరించవే పొసఁగు నోచెలియా (॥తానే॥) మచ్చికలుగలచోటి పొందులు మఱవలెటువలె వచ్చునే ఇచ్చకముతోమెలఁగు సరసము లెరవు లే లగునే వెచ్చువెరిగిన ననుపులెల్లను వెనలుగొనకే లుండునే నచ్చుకొట్టక యిట్లనే విన్నసము సేయవే యతనికి (॥తానే॥) మరిగి పాయఁగరాని తగులమి మాననెటువలె వచ్చెనే దొరసివుండినవయసు లేగతిఁ దొలఁగ దొబ్బేనే సరవిగలవొడఁబాటుమాఁటలు చవులు రేఁచకవుండు నటవే వెరవుతోడుత విన్నపము వేవేగఁ జేయవె యతనికి (॥తానే॥) తనివిదీరనిరతులసొంపులు తాళనెటువలె వచ్చునే తనకుఁగా మీఁదెత్తుకుండినతమక మెటువలె దాఁతునే యెనసె నను శ్రీవేంకటేశ్వరుఁ డిటకుఁ దానే వచ్చికరుణను వినయమున నాసంతసంబులు విన్నవించవె యతనికి English(||pallavi||) tāne yĕṟum̐gunu annidagavulu dayam̐dalaṁchī nibuḍĕ ramaṇum̐ḍu pūni yŏgamām̐ ṭĕchchariṁchave pŏsam̐gu nosĕliyā (||tāne||) machchigalugalasoḍi pŏṁdulu maṟavalĕḍuvalĕ vachchune ichchagamudomĕlam̐gu sarasamu lĕravu le lagune vĕchchuvĕrigina nanubulĕllanu vĕnalugŏnage luṁḍune nachchugŏṭṭaga yiṭlane vinnasamu seyave yadanigi (||tāne||) marigi pāyam̐garāni tagulami mānanĕḍuvalĕ vachchĕne dŏrasivuṁḍinavayasu legadim̐ dŏlam̐ga dŏbbene saravigalavŏḍam̐bāḍumām̐ṭalu savulu rem̐sagavuṁḍu naḍave vĕravudoḍuda vinnabamu vevegam̐ jeyavĕ yadanigi (||tāne||) tanividīraniradulasŏṁpulu tāḽanĕḍuvalĕ vachchune tanagum̐gā mīm̐dĕttuguṁḍinadamaga mĕḍuvalĕ dām̐tune yĕnasĕ nanu śhrīveṁkaḍeśhvarum̐ ḍiḍagum̐ dāne vachchigaruṇanu vinayamuna nāsaṁtasaṁbulu vinnaviṁchavĕ yadanigi