Title (Indic)తానే యెఱుఁగుననవే తరవాతి పనులెల్లా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తానే యెఱుఁగుననవే తరవాతి పనులెల్లా నే నేమిచెప్పేఁ దనకు నేరిపేనా సుద్దులు (॥తానే॥) చిత్తములో తమకము చిమ్మిరేఁచఁగా వొత్తియణఁచేనంటే నొద్దికయ్యీనా గుత్తపుగుబ్బలు పైపై గొప్పలు గాఁగా(గా?) బొత్తుగాఁ గొలఁదివెట్టి బుద్దిచెప్పవచ్చునా (॥తానే॥) కన్నులఁ జూచేయాసలు కదుమఁగాను వన్నెలఁబట్ట నెఁ(నెం?) తైనా వనమయ్యీనా తిన్నవివయసు తరితీపుసేయఁగా వున్నతి నందులకు నూరకుండవచ్చునా (॥తానే॥) వీనుల విన్నవినికి వేగిరించఁగా ఆనుకొన్న కోరికలు ఆఁపవచ్చునా పూని యలమేల్ మంగవిభుఁడు శ్రీవేంకటేశుఁడు మేనవానితో నన్నేలె మెచ్చకుండవచ్చునా English(||pallavi||) tāne yĕṟum̐gunanave taravādi panulĕllā ne nemisĕppem̐ danagu neribenā suddulu (||tāne||) sittamulo tamagamu simmirem̐sam̐gā vŏttiyaṇam̐senaṁṭe nŏddigayyīnā guttabugubbalu paibai gŏppalu gām̐gā(gā?) bŏttugām̐ gŏlam̐divĕṭṭi buddisĕppavachchunā (||tāne||) kannulam̐ jūseyāsalu kadumam̐gānu vannĕlam̐baṭṭa nĕm̐(nĕṁ?) tainā vanamayyīnā tinnavivayasu taridībuseyam̐gā vunnadi naṁdulagu nūraguṁḍavachchunā (||tāne||) vīnula vinnavinigi vegiriṁcham̐gā ānugŏnna korigalu ām̐pavachchunā pūni yalamel maṁgavibhum̐ḍu śhrīveṁkaḍeśhum̐ḍu menavānido nannelĕ mĕchchaguṁḍavachchunā