Title (Indic)తానే యెఱుఁగుఁ గాక దండనున్నాఁడు విభుఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తానే యెఱుఁగుఁ గాక దండనున్నాఁడు విభుఁడు యీనేరుపు లీకత లేమని చెప్పుదునే (॥॥) చిత్తములోపలిసిగ్గు చెప్పరాదు బత్తితోడి తలపోఁత భావించరాదు గుత్తపు గుబ్బలవుబ్బు గురి లేదు యిత్తల నోచెలులాల యేమని చెప్పుదునే (॥॥) వాడికనాకోరిక వశగాదు వేడుకకు నెంతైనాను వెలలేదు వోడక నాతమకము వోరువరాదు యీడనె నాయడియాస లేమని చెప్పుదునే (॥॥) తొట్టుకున్న జవ్వనము దొబ్బితేఁ బోదు చుట్టుకున్ననావలపు చూపరాదు యిట్టె శ్రీవేంకటేశుఁ డింతలోనే నన్నుఁ గూడె యెట్టనెదిటి సంతోస మేమని చెప్పుదునే English(||pallavi||) tāne yĕṟum̐gum̐ gāga daṁḍanunnām̐ḍu vibhum̐ḍu yīnerubu līgada lemani sĕppudune (||||) sittamulobalisiggu sĕpparādu battidoḍi talabom̐ta bhāviṁcharādu guttabu gubbalavubbu guri ledu yittala nosĕlulāla yemani sĕppudune (||||) vāḍiganāgoriga vaśhagādu veḍugagu nĕṁtainānu vĕlaledu voḍaga nādamagamu voruvarādu yīḍanĕ nāyaḍiyāsa lemani sĕppudune (||||) tŏṭṭugunna javvanamu dŏbbidem̐ bodu suṭṭugunnanāvalabu sūbarādu yiṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalone nannum̐ gūḍĕ yĕṭṭanĕdiḍi saṁtosa memani sĕppudune