Title (Indic)తానే యెఱుఁగుఁ బతి తలఁపించరే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తానే యెఱుఁగుఁ బతి తలఁపించరే యీ నెలఁత మేలుదాయ నెట్టోర్వ వచ్చునే (॥॥) కొమ్మతలపోఁతలేడ కోవిలకూఁ తలేడ నిమ్మలపుమనసేడ నివ్వెరగేడ పమ్ముకొన్నసిగ్గులేడ పట్టరానితమి యేడ ఇమ్ముల నిట్టివలపు లెట్టోర్వవచ్చునే (॥॥) కలయవేడుకలేడ కంతునిబాణములేడ నెలకొన్న యాసలేడ నిట్టూర్పులేడ చెలిచక్కఁ దనమేడ చెక్కిటిచేయిచింతలేడ ఇల నిట్టివలపులు యెట్టోర్వవచ్చునే (॥॥) మంతనాన నుండిటేడ మలయుకోరికలేడ సంతసపుమాటలేడ జాగులేడ ఇంతలో శ్రీవేంటేశుఁ డిట్టె వచ్చి యాకె నేలె యెంతయినా నీవలపు లెట్టోర్వవచ్చునే English(||pallavi||) tāne yĕṟum̐gum̐ badi talam̐piṁchare yī nĕlam̐ta meludāya nĕṭṭorva vachchune (||||) kŏmmadalabom̐taleḍa kovilagūm̐ taleḍa nimmalabumanaseḍa nivvĕrageḍa pammugŏnnasigguleḍa paṭṭarānidami yeḍa immula niṭṭivalabu lĕṭṭorvavachchune (||||) kalayaveḍugaleḍa kaṁtunibāṇamuleḍa nĕlagŏnna yāsaleḍa niṭṭūrbuleḍa sĕlisakkam̐ danameḍa sĕkkiḍiseyisiṁtaleḍa ila niṭṭivalabulu yĕṭṭorvavachchune (||||) maṁtanāna nuṁḍiḍeḍa malayugorigaleḍa saṁtasabumāḍaleḍa jāguleḍa iṁtalo śhrīveṁṭeśhum̐ ḍiṭṭĕ vachchi yāgĕ nelĕ yĕṁtayinā nīvalabu lĕṭṭorvavachchune