Title (Indic)తానే యెఱుఁగుగాక తఱవాతి పనులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తానే యెఱుఁగుగాక తఱవాతి పనులు పూనిపట్టి తనునెట్టు బోదించవచ్చునే (॥తానే॥) పట్టరానిది వయసు పంచరానిది వలపు కట్టిపెట్టరానివి కనుచూపులు మెట్టరానిది మనసు మీరరానివి వాసులు యెట్టుసేసినా విభుని నేమని సొలతునే (॥తానే॥) చెప్పఁగరానిది సిగ్గు సేయరానిది నగవు కప్పి పెట్టరానివి చక్కఁదనములు తిప్పరానిది గుణము తెంచరానిది కోరికె అప్పటి నీతనిం గాధన నెట్టువచ్చునే (॥తానే॥) తనియరానిది రతి దాఁటరానిది పొందు మొనసి మానరానిది మొగమోటము యెనసె శ్రీవేంకటేశుఁ డే నలమేలుమంగను చనవిచ్చెఁ దను నెట్టు సాదించవచ్చునే English(||pallavi||) tāne yĕṟum̐gugāga taṟavādi panulu pūnibaṭṭi tanunĕṭṭu bodiṁchavachchune (||tāne||) paṭṭarānidi vayasu paṁcharānidi valabu kaṭṭibĕṭṭarānivi kanusūbulu mĕṭṭarānidi manasu mīrarānivi vāsulu yĕṭṭusesinā vibhuni nemani sŏladune (||tāne||) sĕppam̐garānidi siggu seyarānidi nagavu kappi pĕṭṭarānivi sakkam̐danamulu tipparānidi guṇamu tĕṁcharānidi korigĕ appaḍi nīdaniṁ gādhana nĕṭṭuvachchune (||tāne||) taniyarānidi radi dām̐ṭarānidi pŏṁdu mŏnasi mānarānidi mŏgamoḍamu yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍe nalamelumaṁganu sanavichchĕm̐ danu nĕṭṭu sādiṁchavachchune