Title (Indic)తానే యెఱుఁగు విభుఁడు తన ఇచ్చలోదాన WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తానే యెఱుఁగు విభుఁడు తన ఇచ్చలోదాన తానకముగా నన్ను దయఁజూడుమనవే (॥తానే॥) తలఁచితే వలపులు తామరదంపరలౌను సొలసితే మాటలకుఁ జోటు గలుగు వలెనంటే నాసలు వండవండనట్లవును పలమారు నే విన్నపము సే సే దేమే (॥తానే॥) యెనసితే దమకము లీఁతలుమోఁతలునౌను మనసు లేకములైతే మర్మము లంటు అనువైతే చెనకులు అనలుఁగొనలుసాగు పెనఁగిపెనఁగి తన్నుఁ బెరరేఁచే దేమే (॥తానే॥) కూడితే మొగమిచ్చలు కొండలుఁ గోటులునౌను జోడువాయ కుండితేను సొంపు లెక్కును యడ నన్నలమేల్మంగ నెనసె నింతటిలోనె వోడక శ్రీవేంకటేశు నొరసే దేమే English(||pallavi||) tāne yĕṟum̐gu vibhum̐ḍu tana ichchalodāna tānagamugā nannu dayam̐jūḍumanave (||tāne||) talam̐side valabulu tāmaradaṁparalaunu sŏlaside māḍalagum̐ joḍu galugu valĕnaṁṭe nāsalu vaṁḍavaṁḍanaṭlavunu palamāru ne vinnabamu se se deme (||tāne||) yĕnaside damagamu līm̐talumom̐talunaunu manasu legamulaide marmamu laṁṭu anuvaide sĕnagulu analum̐gŏnalusāgu pĕnam̐gibĕnam̐gi tannum̐ bĕrarem̐se deme (||tāne||) kūḍide mŏgamichchalu kŏṁḍalum̐ goḍulunaunu joḍuvāya kuṁḍidenu sŏṁpu lĕkkunu yaḍa nannalamelmaṁga nĕnasĕ niṁtaḍilonĕ voḍaga śhrīveṁkaḍeśhu nŏrase deme