Title (Indic)తానే యెఱఁగఁడా తగినజాణఁ డతఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తానే యెఱఁగఁడా తగినజాణఁ డతఁడు మానిని నిను మన్నించె మన్ననలే చాలదా (॥తానే॥) మట్టులేని మాటలేల మందెమేల మింతయేల గుట్టుతో నవ్వుటే మంచిగుణముగాదా చిట్టంబుఁజెనకులేల సిగ్గువడి వుండనేల వొట్టినమోహము తోడ నుస్సురంటెఁ జాలదా (॥తానే॥) కానికానివొట్లేల కాఁకలఁ బొరలనేల మౌనముతో నుండుటే మంచిదిగాదా పానుపుపై నిద్దురేలపైఁ గలవరింపేల పూనిన జాగరముల పొద్దువోకే చాలదా (॥తానే॥) యిందాఁకా బింకమేల యిటు పంతమియ్యనేల పొంది మేనుమరచుటే బుద్దిగాదా అందపు శ్రీవేంకటేశుఁ డంతలోనె నిన్నుఁ గూడె గొందినే మేని చెమటే గురితిది చాలదా English(||pallavi||) tāne yĕṟam̐gam̐ḍā taginajāṇam̐ ḍadam̐ḍu mānini ninu manniṁchĕ mannanale sāladā (||tāne||) maṭṭuleni māḍalela maṁdĕmela miṁtayela guṭṭudo navvuḍe maṁchiguṇamugādā siṭṭaṁbum̐jĕnagulela sigguvaḍi vuṁḍanela vŏṭṭinamohamu toḍa nussuraṁṭĕm̐ jāladā (||tāne||) kānigānivŏṭlela kām̐kalam̐ bŏralanela maunamudo nuṁḍuḍe maṁchidigādā pānububai niddurelabaim̐ galavariṁpela pūnina jāgaramula pŏdduvoge sāladā (||tāne||) yiṁdām̐kā biṁkamela yiḍu paṁtamiyyanela pŏṁdi menumarasuḍe buddigādā aṁdabu śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalonĕ ninnum̐ gūḍĕ gŏṁdine meni sĕmaḍe gurididi sāladā