Title (Indic)తానే వచ్చి రమణుఁడు దయదలఁచుటే మేలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తానే వచ్చి రమణుఁడు దయదలఁచుటే మేలు నేనా తన కెదురు నేరుపు లేమున్నవే (॥తానే॥) ఆసలు ఘనమైతేను అట్టె ప్రియాలు చెప్పించు వేసా లెక్కుడయితేను విఱ్ఱివీఁగించు వాసులు మిక్కుటమైతే వట్టి యెగ్గులు వట్టించు యీ సుద్దు లేమి చెప్పీనే యింతుల బతుకులు (॥తానే॥) చెలిమి వెగ్గళమైతే చేఁతలెల్లాఁ జేయించు వలపులు దరచైతే వాడిక రేఁచు పలుకులు దట్టమైతే పంతములెల్లా నిప్పించు కలవెల్లా నిటులానే కాంతల బదుకులు (॥తానే॥) నగవు లధికమైతే ననుపులు వుట్టించు మొగమోటలు మెఁడైతే మొక్కింపించు తగ శ్రీవేంకటేశుఁ డితట నీడ నన్ను నేలె జగములో నీడేరెనే సతుల బతుకులు English(||pallavi||) tāne vachchi ramaṇum̐ḍu dayadalam̐suḍe melu nenā tana kĕduru nerubu lemunnave (||tāne||) āsalu ghanamaidenu aṭṭĕ priyālu sĕppiṁchu vesā lĕkkuḍayidenu viṭrivīm̐giṁchu vāsulu mikkuḍamaide vaṭṭi yĕggulu vaṭṭiṁchu yī suddu lemi sĕppīne yiṁtula badugulu (||tāne||) sĕlimi vĕggaḽamaide sem̐talĕllām̐ jeyiṁchu valabulu darasaide vāḍiga rem̐su palugulu daṭṭamaide paṁtamulĕllā nippiṁchu kalavĕllā niḍulāne kāṁtala badugulu (||tāne||) nagavu ladhigamaide nanubulu vuṭṭiṁchu mŏgamoḍalu mĕm̐ḍaide mŏkkiṁpiṁchu taga śhrīveṁkaḍeśhum̐ ḍidaḍa nīḍa nannu nelĕ jagamulo nīḍerĕne sadula badugulu