Title (Indic)తానే వచ్చీఁగాని తడవకువే పతిని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తానే వచ్చీఁగాని తడవకువే పతిని చేనంటి మునుపే నాకు సేస వెట్టినాఁడు (॥తానే॥) తలఁపులకొలఁదివే తగులాయాలు వలచినకొలఁదివే వాడికలు పిలుపులకొలఁదివే ప్రియములు బలిమి సేయఁగఁ బోతే పచ్చిదేరుఁ బనులు (॥తానే॥) ఆడినకొలఁదివే యాస మాఁటలు కూడినకొలఁదివే కూటములు వేడుకకొలఁదివే వినోదాలు వాడుకొనఁబోతేను వసగావు పనులు (॥తానే॥) ననిచినకొలఁదివే నగవులు యెనసినకొలఁదివే యింపు సొంపులు చెనకి నన్నేలినాఁడు శ్రీవేంకటేశుఁడు పెనఁగఁగఁబోతేను పెచ్చురేఁగుఁ బనులు English(||pallavi||) tāne vachchīm̐gāni taḍavaguve padini senaṁṭi munube nāgu sesa vĕṭṭinām̐ḍu (||tāne||) talam̐pulagŏlam̐dive tagulāyālu valasinagŏlam̐dive vāḍigalu pilubulagŏlam̐dive priyamulu balimi seyam̐gam̐ bode pachchiderum̐ banulu (||tāne||) āḍinagŏlam̐dive yāsa mām̐ṭalu kūḍinagŏlam̐dive kūḍamulu veḍugagŏlam̐dive vinodālu vāḍugŏnam̐bodenu vasagāvu panulu (||tāne||) nanisinagŏlam̐dive nagavulu yĕnasinagŏlam̐dive yiṁpu sŏṁpulu sĕnagi nannelinām̐ḍu śhrīveṁkaḍeśhum̐ḍu pĕnam̐gam̐gam̐bodenu pĕchchurem̐gum̐ banulu