Title (Indic)తానే వచ్చీఁగాక తరవులు వెట్టనేల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తానే వచ్చీఁగాక తరవులు వెట్టనేల కానుకలు మీచేనంపి కక్కసించవలెనా (॥తానే॥) తలఁపులం బారితేనే తనువులు సోఁకినట్టు అలయించి యతనిమే నంటవలెనా చెలిమిసేసితేనే చేతికిలోనైనట్టు చెలులచే రమ్మని చెప్పించవలెనా (॥తానే॥) కమ్మి సుద్దులు వింటేనే కాఁగిలించుకొన్నట్టు సమ్మతిచేసి చేతులు చాఁచవలెనా పిమ్మటఁ బేరుకొంటేనే ప్రేమం దనివైనట్టు రమ్మని పిలిపించి రతిసేయవలెనా (॥తానే॥) యీడకు విచ్చేసితేనే యెడవాయకుండినట్టు జోడైయుండ నొడఁబఱచుకోవలెనా కూడె శ్రీవేంకటేశుఁ డిక్కున నలమేల్మంగను జాడతోడ తనమోవి చవిచూపవలెనా English(||pallavi||) tāne vachchīm̐gāga taravulu vĕṭṭanela kānugalu mīsenaṁpi kakkasiṁchavalĕnā (||tāne||) talam̐pulaṁ bāridene tanuvulu som̐kinaṭṭu alayiṁchi yadanime naṁṭavalĕnā sĕlimisesidene sedigilonainaṭṭu sĕlulase rammani sĕppiṁchavalĕnā (||tāne||) kammi suddulu viṁṭene kām̐giliṁchugŏnnaṭṭu sammadisesi sedulu sām̐savalĕnā pimmaḍam̐ berugŏṁṭene premaṁ danivainaṭṭu rammani pilibiṁchi radiseyavalĕnā (||tāne||) yīḍagu vichchesidene yĕḍavāyaguṁḍinaṭṭu joḍaiyuṁḍa nŏḍam̐baṟasugovalĕnā kūḍĕ śhrīveṁkaḍeśhum̐ ḍikkuna nalamelmaṁganu jāḍadoḍa tanamovi savisūbavalĕnā