Title (Indic)తానే తేరీఁగాని తరవాతిపనులెల్లా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తానే తేరీఁగాని తరవాతిపనులెల్లా వెూనము తోడుతనే వెూము చూపుమనవే (॥॥) సరసమాడఁగాఁ దన్ను సమ్మతిఁ జేకొందుఁ గాక గరిమలఁ బెనఁగుచుఁ గాదనేనా మరిగితి నెన్నిమాట లాడించీనే మురిపెపుఁ జూపులను మోము చూపు మనవే (॥॥) నగవులు నగఁ గాను నంటున మొక్కుదు గాక వెగటులు వచరించ వింతదాననా అగడున నెంతేసియాసలు రేఁచీనే మొగి విచ్చక మన్నించి మోము చూపుమనవే (॥॥) మాటలు తానాడఁ గాను మక్కువఁ గూడుదుఁ గాక చీటికిమాటికిఁ గొచ్చి సిగ్గురేఁచేనా యీటున శ్రీ వేంకటేశుఁ డేలెఁ గతలేమిటికే మూటవలపుల నాకు మోము చూపుమనవే English(||pallavi||) tāne terīm̐gāni taravādibanulĕllā vĕూnamu toḍudane vĕూmu sūbumanave (||||) sarasamāḍam̐gām̐ dannu sammadim̐ jegŏṁdum̐ gāga garimalam̐ bĕnam̐gusum̐ gādanenā marigidi nĕnnimāḍa lāḍiṁchīne muribĕbum̐ jūbulanu momu sūbu manave (||||) nagavulu nagam̐ gānu naṁṭuna mŏkkudu gāga vĕgaḍulu vasariṁcha viṁtadānanā agaḍuna nĕṁtesiyāsalu rem̐sīne mŏgi vichchaga manniṁchi momu sūbumanave (||||) māḍalu tānāḍam̐ gānu makkuvam̐ gūḍudum̐ gāga sīḍigimāḍigim̐ gŏchchi siggurem̐senā yīḍuna śhrī veṁkaḍeśhum̐ ḍelĕm̐ gadalemiḍige mūḍavalabula nāgu momu sūbumanave