Title (Indic)తానే తెలుసుకొనీఁ దరుణి లాగు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తానే తెలుసుకొనీఁ దరుణి లాగు వీనులలో మనమిట్టె విన్నవించవలెనా (॥తానే॥) చనవుగలదానికి సరసములాడఁజెల్లు ననుపుగలదానికినవ్వఁ జెల్లు వినయపుదానికి వేడుకలెలాఁజెల్లు మనమేలే యాతనిమర్మము లెత్తఁగను (॥తానే॥) మందెమేళపుదానికి మారుకొనివుండఁజెల్లు అందగారిదానికి పై యాడఁ జెల్లును పొందుచేసిన దానికి పొగడఁగఁ జెల్లును మందలించి మన మిట్టె మనుపఁగ వచ్చునా (॥తానే॥) పాయరానిదానికి పంతములాడఁజెల్లు మాయదారిదానికి మలయఁజెల్లు యీయెడ శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁగూడె వేయైనా మనమిఁక విడిపించగలమా English(||pallavi||) tāne tĕlusugŏnīm̐ daruṇi lāgu vīnulalo manamiṭṭĕ vinnaviṁchavalĕnā (||tāne||) sanavugaladānigi sarasamulāḍam̐jĕllu nanubugaladāniginavvam̐ jĕllu vinayabudānigi veḍugalĕlām̐jĕllu manamele yādanimarmamu lĕttam̐ganu (||tāne||) maṁdĕmeḽabudānigi mārugŏnivuṁḍam̐jĕllu aṁdagāridānigi pai yāḍam̐ jĕllunu pŏṁdusesina dānigi pŏgaḍam̐gam̐ jĕllunu maṁdaliṁchi mana miṭṭĕ manubam̐ga vachchunā (||tāne||) pāyarānidānigi paṁtamulāḍam̐jĕllu māyadāridānigi malayam̐jĕllu yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐gūḍĕ veyainā manamim̐ka viḍibiṁchagalamā