Title (Indic)తానే తెలియుఁ గాక తలఁచఁగ నెట్టువచ్చు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తానే తెలియుఁ గాక తలఁచఁగ నెట్టువచ్చు నానాగతుల తన నాటకపుమాయ (॥తానే॥) అట్టె యేఁబదియైన యక్షరాలలోనట తిట్టులట వొకకొన్ని దీవెనలటా మట్టుతో వేదములట మంత్రములట కొన్ని యిట్టివి చిక్కులు భూమి నిఁకనెన్ని గలవో (॥తానే॥) కదిసిన యఱువదిగడియలలోనట పొదలు నడకలట భోగములటా నిదురట వొకకొంత నేరుపులు కొన్నియట యెదుట చూడఁగఁ జూడ నిఁక నెన్ని గలవో (॥తానే॥) రేవగలు కన్నులివి రెంటిలోనేయట దైవము జీవులలోనే తానకమట శ్రీవేంకటాద్రిమీఁద జెలఁగి యా(గెనా?)తఁడే యట యేవంక నీచేఁతలు యిఁక నెన్నిగలవో English(||pallavi||) tāne tĕliyum̐ gāga talam̐sam̐ga nĕṭṭuvachchu nānāgadula tana nāḍagabumāya (||tāne||) aṭṭĕ yem̐badiyaina yakṣharālalonaḍa tiṭṭulaḍa vŏgagŏnni dīvĕnalaḍā maṭṭudo vedamulaḍa maṁtramulaḍa kŏnni yiṭṭivi sikkulu bhūmi nim̐kanĕnni galavo (||tāne||) kadisina yaṟuvadigaḍiyalalonaḍa pŏdalu naḍagalaḍa bhogamulaḍā niduraḍa vŏgagŏṁta nerubulu kŏnniyaḍa yĕduḍa sūḍam̐gam̐ jūḍa nim̐ka nĕnni galavo (||tāne||) revagalu kannulivi rĕṁṭiloneyaḍa daivamu jīvulalone tānagamaḍa śhrīveṁkaḍādrimīm̐da jĕlam̐gi yā(gĕnā?)tam̐ḍe yaḍa yevaṁka nīsem̐talu yim̐ka nĕnnigalavo