Title (Indic)తానట ప్రాణేశుండట తమకము తమకముఁ గూడఁగ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తానట ప్రాణేశుండట తమకము తమకముఁ గూడఁగ వేనలి జారినఁ దలఁకని వేడుకలెట్టివొకో (॥తానట॥) మీఁటినఁ బగిలెడిగుబ్బలమీఁద నలందిన గందపు- వేటులతళుకులు పయ్యెద వెలుఁపలఁబొలయఁగను నాఁటిన మదనుని శరముల నలఁకువనొయ్యన తోఁపఁగ మాటకు మాఁటాడదు చెలిమర్మంబెట్టిదొకో (॥తానట॥) మించిన తొడల మెఱుంగుల మెలుఁతుక గట్టిన పుట్టము చించుక వెడలిన నిగ్గులు సిగ్గులు దొలఁకగను వంచినరెప్పల కన్నుల వడియు జలంబులు చెక్కుల నించినఁ బలుకనిభావపు నెవ్వగలెట్టివొకో (॥తానట॥) కమ్మనితావుల చెమటల గాలికి నొయ్యన మెచ్చుచు సొమ్మలఁదేలెడి మరపుల సొక్కులఁ దేలుచును దిమ్మరికోనేటప్పని తిరువేంకటపతిఁ గూడిన కొమ్మకు మీఁదటియాసల కోరికలెటివొకో English(||pallavi||) tānaḍa prāṇeśhuṁḍaḍa tamagamu tamagamum̐ gūḍam̐ga venali jārinam̐ dalam̐kani veḍugalĕṭṭivŏgo (||tānaḍa||) mīm̐ṭinam̐ bagilĕḍigubbalamīm̐da nalaṁdina gaṁdabu- veḍuladaḽugulu payyĕda vĕlum̐palam̐bŏlayam̐ganu nām̐ṭina madanuni śharamula nalam̐kuvanŏyyana tom̐pam̐ga māḍagu mām̐ṭāḍadu sĕlimarmaṁbĕṭṭidŏgo (||tānaḍa||) miṁchina tŏḍala mĕṟuṁgula mĕlum̐tuga gaṭṭina puṭṭamu siṁchuga vĕḍalina niggulu siggulu dŏlam̐kaganu vaṁchinarĕppala kannula vaḍiyu jalaṁbulu sĕkkula niṁchinam̐ baluganibhāvabu nĕvvagalĕṭṭivŏgo (||tānaḍa||) kammanidāvula sĕmaḍala gāligi nŏyyana mĕchchusu sŏmmalam̐delĕḍi marabula sŏkkulam̐ delusunu dimmarigoneḍappani tiruveṁkaḍabadim̐ gūḍina kŏmmagu mīm̐daḍiyāsala korigalĕḍivŏgo