Title (Indic)తాముఁ దెలియరూ తగఁ జెప్పిన వినరూ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తాముఁ దెలియరూ తగఁ జెప్పిన వినరూ పామరపుఁ దమ కర్మఫలమో హరిమాయయో (॥తాము॥) చీఁకటిఁ బెడబాపేటి చేరువ సూర్యోదయము చీఁకటి కూబలకైతే చిమ్మి రేఁచును యాఁకటతో విజ్ఞానము నందిచ్చే శ్రీ హరిభక్తి కాఁకల దుర్మార్గులకుఁ గాన నీదూ (॥తాము॥) అందరు రుచిగొనేటి అన్నము బహురోగికి కందువ నజీర్ణమై కారించును యెందును శ్రీహరి దైవ మెక్కుడన్న చదువులు మందమైన జడునికి మఱఁగులై తోఁచును (॥తాము॥) ధరఁ గొందరు మూర్ఖులు తగ నొక్కరాజుఁ గొల్చి పరిచారకునిఁ దిట్టి భంగ పడ్డట్టు యిరవుగ శ్రీ వేంకటేశుఁ గొల్చి వారివారి విరసాలాడుచుఁ దామె విఫలులై పోదురు English(||pallavi||) tāmum̐ dĕliyarū tagam̐ jĕppina vinarū pāmarabum̐ dama karmaphalamo harimāyayo (||tāmu||) sīm̐kaḍim̐ bĕḍabābeḍi seruva sūryodayamu sīm̐kaḍi kūbalagaide simmi rem̐sunu yām̐kaḍado vijñānamu naṁdichche śhrī haribhakti kām̐kala durmārgulagum̐ gāna nīdū (||tāmu||) aṁdaru rusigŏneḍi annamu bahurogigi kaṁduva najīrṇamai kāriṁchunu yĕṁdunu śhrīhari daiva mĕkkuḍanna saduvulu maṁdamaina jaḍunigi maṟam̐gulai tom̐sunu (||tāmu||) dharam̐ gŏṁdaru mūrghulu taga nŏkkarājum̐ gŏlsi parisāragunim̐ diṭṭi bhaṁga paḍḍaṭṭu yiravuga śhrī veṁkaḍeśhum̐ gŏlsi vārivāri virasālāḍusum̐ dāmĕ viphalulai poduru